Telugu Global
NEWS

తెలంగాణలో రేపటినుంచి విద్యా సంస్థలకు మూత..

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూసి వేస్తున్నట్టు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ నిబంధన వర్తిస్తుందని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అయితే మెడికల్ కాలేజీలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఇటీవల తెలంగాణలోని పలు గురుకుల పాఠశాలలు, హాస్టల్స్ లో కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో వరుసగా హాస్టల్స్ మూసివేస్తూ వచ్చారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందుగా […]

తెలంగాణలో రేపటినుంచి విద్యా సంస్థలకు మూత..
X

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూసి వేస్తున్నట్టు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ నిబంధన వర్తిస్తుందని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అయితే మెడికల్ కాలేజీలకు మాత్రం మినహాయింపునిచ్చారు.

ఇటీవల తెలంగాణలోని పలు గురుకుల పాఠశాలలు, హాస్టల్స్ లో కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో వరుసగా హాస్టల్స్ మూసివేస్తూ వచ్చారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్ విద్యాసంస్థల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. దీనిపై తీవ్ర కసరత్తు చేసిన అనంతరం కరోనాని కట్టడి చేయాలంటే స్కూల్స్ మూసివేయడం మినహా మరో మార్గం లేదని గుర్తించారు. అందుకే స్కూల్స్ మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు.

కరోనా భయం తగ్గిపోయిన తర్వాత ఏపీ కంటే కాస్త ఆలస్యంగానే తెలంగాణలో విద్యా సంస్థలు తెరచుకున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులకు, ఫిబ్రవరి 24నుంచి 6, 7, 8 తరగతులకు స్కూల్స్ మొదలుపెట్టారు. ఇటు ఏపీలో ప్రైమరీ సెక్షన్ నడుస్తున్నా.. తెలంగాణలో ఇంకా నర్సరీ నుంచి 5వ తరగతి వరకు స్కూల్స్ మొదలు కాలేదు. నర్సరీ సెక్షన్ మొదలు పెట్టాలని ప్రైవేటు విద్యా సంస్థలనుంచి ఒత్తిడి ఉన్నా కూడా ప్రభుత్వం ధైర్యం చేయలేకపోయింది. ఈ క్రమంలో సెకండ్ వేవ్ కారణంగా మరిన్ని కేసులు పెరిగాయి. ఇటు ఏపీ ప్రభుత్వం సెకండ్ వేవ్ అనగానే.. ఒంటిపూడ బడులకు ఆదేశాలిచ్చింది. తెలంగాణ సర్కారు మాత్రం ఏకంగా స్కూల్స్ మొత్తం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో లాగా ఆన్ లైన్ క్లాసులు మాత్రం జరుగుతాయని చెప్పింది. పరీక్షల విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఈసారి టెన్త్‌ పరీక్షలు మే 17 నుంచి జరపడానికి ఇది వరకే విద్యా శాఖ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో దానిపై కూడా పునరాలోచించబోతోంది ప్రభుత్వం. అప్పటి పరిస్థితినిబట్టి పరీక్షలు నిర్వహించాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తారు.

First Published:  23 March 2021 7:38 AM GMT
Next Story