Telugu Global
Health & Life Style

భారత్ నుంచి మరో సంజీవని.. ట్యాబ్లెట్ల రూపంలో వ్యాక్సిన్

కోవిడ్ 19 వ్యాక్సిన్.. క్యాప్సుల్స్ రూపంలో మార్కెట్లోకి రాబోతుంది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక ఫార్మాసూటికల్ కంపెనీలు శ్రమిస్తుండగా.. వాటిలో ఇండియాకు చెందిన ప్రేమాస్ బయోటెక్ కూడా ఉంది. దీన్ని అమెరికాకు చెందిన ఒరామ్‌డ్ ఫార్మాసూటికల్స్ తో కలిసి తయారు చేస్తోంది. ఓరల్ గా నోటిద్వారా తీసుకునే ఓరావ్యాక్స్ కోవిడ్ 19 క్యాప్సుల్ ను సింగిల్ డోస్ జంతువులపై ప్రయోగించి చూడగా సమర్థవంతంగా పనిచేసింది. యాంటీబాడీలను ప్రొడ్యూస్ చేయడంలో, న్యూట్రలైజ్ చేయడంలో ఇవి బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా […]

భారత్ నుంచి మరో సంజీవని.. ట్యాబ్లెట్ల రూపంలో వ్యాక్సిన్
X

కోవిడ్ 19 వ్యాక్సిన్.. క్యాప్సుల్స్ రూపంలో మార్కెట్లోకి రాబోతుంది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక ఫార్మాసూటికల్ కంపెనీలు శ్రమిస్తుండగా.. వాటిలో ఇండియాకు చెందిన ప్రేమాస్ బయోటెక్ కూడా ఉంది. దీన్ని అమెరికాకు చెందిన ఒరామ్‌డ్ ఫార్మాసూటికల్స్ తో కలిసి తయారు చేస్తోంది.

ఓరల్ గా నోటిద్వారా తీసుకునే ఓరావ్యాక్స్ కోవిడ్ 19 క్యాప్సుల్ ను సింగిల్ డోస్ జంతువులపై ప్రయోగించి చూడగా సమర్థవంతంగా పనిచేసింది. యాంటీబాడీలను ప్రొడ్యూస్ చేయడంలో, న్యూట్రలైజ్ చేయడంలో ఇవి బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇవి శ్వాస వ్యవస్థలకు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేస్తాయి.

ప్రొటీన్ ఆధారిత ఈ క్యాప్సుల్ వ్యాక్సిన్ కోవిడ్ వైరస్ మూడు భాగాలపై ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ క్యాప్సుల్ వ్యాక్సిన్ కు ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంది. అవన్నీ సక్సెస్ అయ్యాక ఇవి కూడా త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

First Published:  23 March 2021 2:20 AM GMT
Next Story