Telugu Global
NEWS

స్వతంత్రులను టీఆర్​ఎస్సే నిలబెట్టింది..!

ఇటీవల వెల్లడైన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్​ఎస్​ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్​, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ స్థానంలో సురభి వాణిదేవి, నల్లగొండ, కరీంనగర్​, వరంగల్​, ఖమ్మం స్థానంలో పల్లా రాజేశ్వర్​రెడ్డి విజయం సాధించారు. అయితే నల్లగొండ స్థానంలో తెలంగాణ జనసమితి తరఫున కోదండరాం పోటీచేసిన విషయం తెలిసిందే. ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కోదండరాంకు కూడా దాదాపు లక్ష ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ ఫలితాలపై ఆయన నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేవలం […]

స్వతంత్రులను టీఆర్​ఎస్సే నిలబెట్టింది..!
X

ఇటీవల వెల్లడైన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్​ఎస్​ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్​, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ స్థానంలో సురభి వాణిదేవి, నల్లగొండ, కరీంనగర్​, వరంగల్​, ఖమ్మం స్థానంలో పల్లా రాజేశ్వర్​రెడ్డి విజయం సాధించారు. అయితే నల్లగొండ స్థానంలో తెలంగాణ జనసమితి తరఫున కోదండరాం పోటీచేసిన విషయం తెలిసిందే. ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కోదండరాంకు కూడా దాదాపు లక్ష ఓట్లు వచ్చాయి.

ఎమ్మెల్సీ ఫలితాలపై ఆయన నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేవలం ఉద్యోగులు, నిరుద్యోగుల ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజెప్పడానికి తాను పోటీచేసినట్టు కోదండరాం ప్రకటించారు. ఎన్నికల్లో పోటీచేసినప్పటి నుంచి తనకు అన్ని వర్గాల పట్టభద్రులు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. కానీ ఆఖరి నిమిషంలో టీఆర్​ఎస్​ డబ్బు, మద్యం విపరీతంగా పంపిణీ చేయడం.. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో తాను ఓటమి పాలయ్యానని కోదండ రాం పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్​ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. ఆయన ప్రతి రౌండ్​లోనూ పల్లా రాజేశ్వర్​రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే కోదండరాం ఎన్నికల ఫలితాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులను టీఆర్​ఎస్​ పార్టీయే పోటీలో నిలబెట్టిందని కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే టీఆర్​ఎస్​ ఈ రకమైన కుట్రకు పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. అయితే కోదండరాంకు కూడా ఈ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థుల కంటే ఆయన ఎక్కువ ఓట్లు సాధించారు. ఓ దశలో రెండో ప్రాధాన్యత ఓట్లతో కోదండరాం విజయం తథ్యమని అంతా భావించారు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. చివరకు ఆయన మూడో స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు.

ఈ ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోయినప్పటికీ నైతికంగా తాను విజయం సాధించానని కోదండరాం పేర్కొన్నారు. తనకు ఓటేసిన పట్టభద్రులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  21 March 2021 12:08 PM GMT
Next Story