Telugu Global
NEWS

అమరావతి భూముల కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఏంటో తెలుసా?

అమరావతి రాజధాని పరిధిలో ఉన్న భూముల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐడీ నమోదు చేసిన ఈ ఎఫ్ఐఆర్‌కు సంబంధించి మార్చి 23న విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వగా.. చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి విచారణపై స్టే తెచ్చుకున్నారు. అయితే అసలు రాజధాని భూములు విషయంలో చంద్రబాబు చేసిన తప్పేంటి? అక్కడి అసైన్డ్ భూముల విషయంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఏం చేశారు అనే […]

అమరావతి భూముల కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఏంటో తెలుసా?
X

అమరావతి రాజధాని పరిధిలో ఉన్న భూముల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐడీ నమోదు చేసిన ఈ ఎఫ్ఐఆర్‌కు సంబంధించి మార్చి 23న విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వగా.. చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి విచారణపై స్టే తెచ్చుకున్నారు. అయితే అసలు రాజధాని భూములు విషయంలో చంద్రబాబు చేసిన తప్పేంటి? అక్కడి అసైన్డ్ భూముల విషయంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఏం చేశారు అనే దానిపై చాలా మందికి అవగాహన లేదు. కానీ వరుసగా ఆనాడు వెలువరించిన జీవోలు చూస్తే.. చంద్రబాబు సీఎం హోదాలో చేసిన తప్పేంటో స్పష్టంగా తెలుస్తున్నది.

తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. ఆ సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించడమే కాకుండా సీఆర్డీఏ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అమరావతి పరిధిలోని భూములను ఈ సంస్థ సేకరించింది. కాగా, ఈ భూముల సేకరణకు గాను 2015 జనవరి 1న చంద్రబాబు ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది.

ఈ జీవోలో ఎస్సీలకు కేటాయించిన అసైన్డ్ భూములకు పరిహారం అవసరం లేదని.. మిగతా కులాలకు చెందిన భూములకు మాత్రం పరిహారం చెల్లించాలంటూ ఆ జీవోలో పేర్కొన్నారు. ఎస్సీలకు ప్రభుత్వమే భూమి కేటాయించినందున వారికి పరిహారం అవసరం లేదంటూ ఆ జీవోలో పేర్కొన్నారు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో పాటు సదరు భూమి హక్కుదారులు ఆందోళన చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఏడాది తర్వాత మరో జీవో విడుదల చేసింది.

2016 ఫిబ్రవరిలో జీవో 41ని విడుదల చేసింది. ఎస్సీలకు కేటాయించిన అసైన్డ్ భూములు అంతటికీ ఏక మొత్తంలో కొంత చెల్లించి సేకరించాలని ఆ జీవోలో పేర్కొన్నారు. మిగతా భూములకు చెల్లిస్తున్న మొత్తం కంటే దళితులకు చెందిన ఈ భూములకు తక్కువ మొత్తమే చెల్లిస్తున్నట్లు ఆ జీవో వల్ల స్పష్టమవుతున్నది. అదే సమయంలో అంతకంటే ఎక్కువ ఇస్తామంటూ చాలా మంది అసైన్డ్ భూములను కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే వేరే వాళ్ల దగ్గర ఎక్కువ వస్తుందంటూ దళితులు ఆ భూములను ఇతరులకు అమ్ముకున్నారు. దీంతో దళితులకు చెందిన భూములు 1 జనవరి 2015 నుంచి జూన్ 2016 మధ్యలో పూర్తిగా ఇతరుల చేతుల్లోకి వెళ్లాయి.

ఇక చంద్రబాబు ప్రభుత్వం జూన్ 2016లో 259 జీవోను తీసుకొని వచ్చింది. ఈ జీవో ప్రకారం సీఆర్డీఏ పరిధిలోని సాధారణ భూములకే కాకుండా అసైన్డ్ భూములకు కూడా సమాన పరిహారం అందుతుందని ఆ జీవోలో పేర్కొన్నారు. అయితే అప్పటికే దళితులకు చెందిన అసైన్డ్ భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. తమకు తక్కువ పరిహారం వస్తుందని భావించి ఇతరులకు అమ్మిన భూములకు చంద్రబాబు ప్రభుత్వం పెద్ద మొత్తంలో పరిహారం ఇస్తున్నట్లు తెలుసుకున్న దళితులు నిరసన వ్యక్తం చేశారు.

దళితుల భూములను కొనుగోలు చేసింది టీడీపీ నాయకులే అని తెలుసుకున్న హక్కుదారులు నిరసన వ్యక్తం చేయడమే కాకుండా కోర్టులో కేసులు వేశారు. దళితులకు జరిగిన ఈ అన్యాయాన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆనాడు రాజధాని భూములపై జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే దళితుల పక్షంగా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డికూడా కోర్టులో కేసు వేశారు.

రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా నమోదు చేస్తారు అనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం.. మానసికంగా, శారీరికంగానే కాకుండా దళితులను ఏ రకమైన మోసం చేసినా ఆ చట్టం వర్తిస్తుందని.. ఆ కేసు దళితులే కాకుండా ఇతరులు కూడా నమోదు చేయవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.

First Published:  20 March 2021 11:26 PM GMT
Next Story