Telugu Global
International

హ్యాపీయెస్ట్ దేశాలు ఇవే..

ప్రపంచంలో హ్యాపీగా ఉండే దేశాల లిస్టును ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు-2021’ ప్రకటించింది. ఈ లిస్ట్ లో ఏవి ముందున్నాయంటే.. ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు-2021’ ప్రకారం.. సంతోషంగా ఉండే దేశాల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఫిన్లాండ్ ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఐస్‌లాండ్, డెన్మార్క్, స్విజ్జర్లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, జర్మనీ, నార్వే న్యూజిలాండ్, ఆస్ట్రియా దేశాలు వరుసగా ఉన్నాయి. అలాగే ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ లో చివరి దేశాలుగా జింబాబ్వే, టాంజానియా, జోర్డాన్, ఇండియా, కొలంబియా, […]

హ్యాపీయెస్ట్ దేశాలు ఇవే..
X

ప్రపంచంలో హ్యాపీగా ఉండే దేశాల లిస్టును ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు-2021’ ప్రకటించింది. ఈ లిస్ట్ లో ఏవి ముందున్నాయంటే..

‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు-2021’ ప్రకారం.. సంతోషంగా ఉండే దేశాల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఫిన్లాండ్ ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఐస్‌లాండ్, డెన్మార్క్, స్విజ్జర్లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, జర్మనీ, నార్వే న్యూజిలాండ్, ఆస్ట్రియా దేశాలు వరుసగా ఉన్నాయి. అలాగే ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ లో చివరి దేశాలుగా జింబాబ్వే, టాంజానియా, జోర్డాన్, ఇండియా, కొలంబియా, బెనిన్, మయన్మార్, నమీబియా, ఈజిప్ట్, కెన్యా దేశాలు ఉన్నాయి.

ఈ నివేదిక ముఖ్యంగా జీడీపీ స్థాయి, లైఫ్ ఎక్స్ పెక్టెన్సీ, సోషల్ సపోర్ట్, స్వేచ్ఛ, అవినీతి, ఆదాయం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని తయారు చేశారు. అయితే, వరల్డ్ హ్యపీనెస్ రిపోర్టులో ఇండియా చివరి నుంచి 10 స్థానాల్లో చోటు దక్కించుకోవడంపై కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

First Published:  20 March 2021 1:40 AM GMT
Next Story