Telugu Global
Health & Life Style

కీళ్లు బలంగా ఉండాలంటే..

శరీరంలో కండరాల కోసం, కొవ్వు కరగడం కోసం ఇలా రకరకాల వ్యాయామాలు ఉన్నాయి. దీంతోపాటే కీళ్ల కోసం కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. అవేంటంటే.. ఎముకల సమస్యలకు, కీళ్లనొప్పులకు ఫిజియో థెరపీల్లాంటి ట్రీట్‌మెంట్స్ తప్ప సాధారణ వ్యాయామాలు తక్కువగా ఉంటాయి. అయితే వ్యాయామాలు చేసే విధానాల్లో కొన్ని మార్పులు చేయడం వల్ల వర్కవుట్స్‌తో బోన్స్ కూడా బెనిఫిట్ పొందేలా చేయొచ్చు. బ్యాలెన్సింగ్ వ్యాయామాలు బ్యాలెన్సింగ్ వర్కవుట్స్‌తో బోన్స్‌ను స్ట్రాంగ్‌గా మలచుకోవచ్చు. స్కిప్పింగ్, వాకింగ్, డాన్సింగ్, ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలు చేయడానికి […]

కీళ్లు బలంగా ఉండాలంటే..
X

శరీరంలో కండరాల కోసం, కొవ్వు కరగడం కోసం ఇలా రకరకాల వ్యాయామాలు ఉన్నాయి. దీంతోపాటే కీళ్ల కోసం కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. అవేంటంటే.. ఎముకల సమస్యలకు, కీళ్లనొప్పులకు ఫిజియో థెరపీల్లాంటి ట్రీట్‌మెంట్స్ తప్ప సాధారణ వ్యాయామాలు తక్కువగా ఉంటాయి. అయితే వ్యాయామాలు చేసే విధానాల్లో కొన్ని మార్పులు చేయడం వల్ల వర్కవుట్స్‌తో బోన్స్ కూడా బెనిఫిట్ పొందేలా చేయొచ్చు.

బ్యాలెన్సింగ్ వ్యాయామాలు
బ్యాలెన్సింగ్ వర్కవుట్స్‌తో బోన్స్‌ను స్ట్రాంగ్‌గా మలచుకోవచ్చు. స్కిప్పింగ్, వాకింగ్, డాన్సింగ్, ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలు చేయడానికి శరీరానికి బ్యాలెన్సింగ్ అవసరం. అలాంటి వ్యాయామాలు చేసేటప్పుడు కాళ్ల ఎముకలు, కీళ్లపై ఒత్తిడి పడుతుంది. దాంతో బోన్స్ స్ట్రెంత్‌ మెరుగుపడుతుంది.

హై స్పీడ్ వ్యాయామాలు
శరీరాన్ని వేగంగా కదిలించాలంటే ఎముకల్లో బలం ఉండాలి. అందుకే రన్నింగ్, స్ప్రింటింగ్, జాగింగ్ లాంటి వాటి ద్వారా ఎముకలు యాక్టివేట్ అవుతాయి. అలాగే మిగతా వర్కవుట్స్‌ను కూడా కాస్త వేగం పెంచి చేయడం వల్ల ఎముకలపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే వర్కవుట్స్ వేగాన్ని ఒకేసారి కాకుండా మెల్లగా పెంచాలి. ఎముకలపై మరీ ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోవాలి.

ఇంపాక్ట్ ట్రైనింగ్
బాక్స్ జంపింగ్, జంపింగ్ జాక్స్, జంపింగ్ స్క్వాట్స్ లాంటి ఇంపాక్ట్ ట్రైనింగ్‌ వ్యాయామాల ద్వారా ఉంటాయి. గాలిలోకి ఎగిరి దూకే వర్కవుట్స్ కాబట్టి వీటిలో కీళ్లు, ఎముకలపై ఒకేసారి ఒత్తిడి పడుతుంది. ఇలాంటి జంపింగ్ వర్కవుట్స్ చేసేటప్పుడు టేకాఫ్ , ల్యాండింగ్ సరిగ్గా ఉండేలా చూసుకుంటే కీళ్లకు స్ట్రెచింగ్ వ్యాయామం అందుతుంది. అలాగే ఈ వ్యాయామాల వల్ల కీళ్లు, కండరాల మధ్య కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది.

జాగ్రత్తలివి
ఎక్కువ బరువు ఉన్నవాళ్లు కీళ్ల మీద ఎక్కువ ఒత్తిడి పడే వ్యాయామాలు చేయకూడదు. జంపింగ్‌ జాక్స్‌, స్కిప్పింగ్‌, లాంటి వాటికి బదులు లెగ్‌ ఎక్స్‌టెన్షన్‌, హ్యామ్‌స్ర్టింగ్ స్ట్రెచ్ లాంటి వ్యాయామాలు రోజూ చేయడం మంచిది.
ఎముకల హెల్త్‌కి క్యాల్షియం చాలా అవసరం. రక్తం, ఎముకల్లో క్యాల్షియం ఉన్నంతకాలం ఎముకలకు ఎలాంటి సమస్యలు రావు. ఆహారంలో క్యాల్షియం లేకపోయినా, శారీరక శ్రమ లేకపోయినా.. ఎముకలు బలహీనపడతాయి. అందుకే క్యాల్షియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే విటమిన్ డి కూడా ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

First Published:  20 March 2021 1:28 AM GMT
Next Story