Telugu Global
National

భారత్ లో వ్యాక్సినేషన్ పూర్తవ్వాలంటే ఏడేళ్లు ఆగాల్సిందే..

పొరుగు దేశాలకంటే వ్యాక్సినేషన్ ముందుగా ప్రారంభించామని అనుకున్నా.. వేగంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందని, రికార్డులు బ్రేక్ చేస్తున్నామని భారత ప్రభుత్వం జబ్బలు చరుచుకున్నా.. అక్కడంత సీన్ లేదనే విషయం తేలిపోయింది. భారత్ లో టీకా పంపిణీ మొదలై రెండు నెలలవుతోంది. జనవరి 16న ఈ మహా యజ్ఞాన్ని ప్రారంభించారు. తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కి టీకా పంపిణీ మొదలైంది. అయితే ఆశించిన స్పందన లేదు. వైద్యరంగానికి చెందినవారు కూడా స్వచ్ఛందంగా ముందుకు రాలేదంటే పరిస్థితి […]

భారత్ లో వ్యాక్సినేషన్ పూర్తవ్వాలంటే ఏడేళ్లు ఆగాల్సిందే..
X

పొరుగు దేశాలకంటే వ్యాక్సినేషన్ ముందుగా ప్రారంభించామని అనుకున్నా.. వేగంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందని, రికార్డులు బ్రేక్ చేస్తున్నామని భారత ప్రభుత్వం జబ్బలు చరుచుకున్నా.. అక్కడంత సీన్ లేదనే విషయం తేలిపోయింది. భారత్ లో టీకా పంపిణీ మొదలై రెండు నెలలవుతోంది. జనవరి 16న ఈ మహా యజ్ఞాన్ని ప్రారంభించారు. తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కి టీకా పంపిణీ మొదలైంది. అయితే ఆశించిన స్పందన లేదు. వైద్యరంగానికి చెందినవారు కూడా స్వచ్ఛందంగా ముందుకు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.. ఉన్నతాధికారుల టార్గెట్ల మేరకు పని పూర్తి చేశారు. జనసామాన్యంలోకి టీకా వచ్చినా కూడా ఇంకా ఎవరూ ఆసక్తి చూపడంలేదంటే అసలు వ్యాక్సినేషన్ కి సగటు భారతీయుడు సిద్ధంగా లేదనే విషయం తేలిపోయింది. ఈ దశలో వ్యాక్సిన్ స్పీడ్ పెంచాలి, వృథాని అరికట్టాలి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ లలో చెప్పడం ఆయనకు కంఠశోష మినహా ఇంకేమీ కాదు.

ఏడేళ్లంటే మాటలా..?
భారత్ లో తొలిదశలో 50కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాలనేది టార్గెట్ అయితే అందులో కేవలం ఏడు శాతమే పూర్తయింది. ఇప్పటి వరకూ కోవిడ్ టీకాలు వేయించుకున్నవారి సంఖ్య సుమారు 4కోట్లు. ఇటీవల ఒక్కరోజులో 30లక్షల వ్యాక్సిన్ డోసుల పంపిణీ ఒక రికార్డుగా మిగిలినా.. ప్రతి రోజూ అదే స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ అవుతుందని చెప్పలేని పరిస్థితి. ఈ నత్త నడకే కొనసాగితే భారత జనాభాకి వ్యాకినేషన్ పూర్తవ్వడానికి దాదాపు ఏడున్నరేళ్లు పడుతుంది. ఇది ఏ స్వచ్ఛంద సంస్థో వేసిన అంచనా కాదు, సాక్షాత్తూ భారత పార్లమెంటరీ స్థాయీ సంఘం వేసిన అంచనా.

తక్షణ కర్తవ్యం ఏంటి..?
కోవిడ్ వ్యాక్సినేషన్ త్వరగా పూర్తయితే ప్రజల్లో ఓ భరోసా ఉంటుంది. అయితే అందరూ మాటలు చెప్పేవారే కానీ, ఎవరూ ధైర్యంగా ముందుకు రావడంలేదు. వ్యాక్సినేషన్ కంపల్సరీ అని అటు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఒకవేళ అలాంటి నిర్ణయమే తీసుకుంటే దాని వల్ల ఏవైనా దుష్పరిణామాలు తలెత్తితే నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అది సాధ్యం కాని పని. అందుకే వివాదాల తేనెతుట్టె కదపకుండా కేంద్రం పని కానిస్తోంది. స్వచ్ఛందంగా వ్యాక్సినేషన్ కి వచ్చాం, పర్యవసానాలకు మేమే బాధ్యులమంటూ మొదట్లో డిక్లరేషన్ల్ వ్యవహారం కలకలం రేపినా.. ఇప్పుడా హడావిడి లేదు. ఈ దశలో భారత్ లో పూర్తి వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడల్లా సాధ్యమయ్యే పని కాదని తేలిపోయింది. ఈలోగా కొత్త వైరస్ లు పుట్టుకు రావడం, ఉన్నవి సరికొత్తగా రూపాంతరం చెందడం.. ఇలాంటి ప్రమాదాలున్నాయి కాబట్టి, వ్యాక్సిన్ తో కరోనాని తరిమి కొడతామనుకోవడం వట్టి భ్రమగానే మిగిలిపోతుందని చెప్పాలి.

First Published:  19 March 2021 8:49 PM GMT
Next Story