Telugu Global
Health & Life Style

ఇది ధరిస్తే వైరస్ కు చుక్కలే..

కరోనా సెకండ్ వేవ్ భయపెడుతున్న సందర్భంలో యూఎస్ కు చెందిన ఏపీఎస్ ల్యాబ్స్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వైరస్ మన దగ్గరకు రాకుండా ఓ డిసిన్ఫెక్షన్ షీల్డ్ ను రిలీజ్ చేసింది. అత్యంత శక్తివంతంగా పనిచేసే ఈ షీల్డ్ ను ధరిస్తే.. ముప్పైమీటర్ల పరిధిలో వైరస్ మన దగ్గరకు రాకుండా కాపాడుతుంది. యూఎస్ కు చెందిన ఏపీఎస్ ల్యాబ్స్ పోర్టబుల్ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ స్టిక్‌ పేరుతో మార్కెట్‌లో ఓ సరికొత్త ప్రొడక్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూఎస్ ఆర్మీ […]

ఇది ధరిస్తే వైరస్ కు చుక్కలే..
X

కరోనా సెకండ్ వేవ్ భయపెడుతున్న సందర్భంలో యూఎస్ కు చెందిన ఏపీఎస్ ల్యాబ్స్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వైరస్ మన దగ్గరకు రాకుండా ఓ డిసిన్ఫెక్షన్ షీల్డ్ ను రిలీజ్ చేసింది. అత్యంత శక్తివంతంగా పనిచేసే ఈ షీల్డ్ ను ధరిస్తే.. ముప్పైమీటర్ల పరిధిలో వైరస్ మన దగ్గరకు రాకుండా కాపాడుతుంది.
యూఎస్ కు చెందిన ఏపీఎస్ ల్యాబ్స్ పోర్టబుల్ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ స్టిక్‌ పేరుతో మార్కెట్‌లో ఓ సరికొత్త ప్రొడక్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూఎస్ ఆర్మీ ఉపయోగిస్తున్న ఈ ప్రొడక్ట్‌ను యునైటెడ్ స్టేట్స్ డ్రగ్ కంట్రోల్ కంపెనీ ఎఫ్‌డిఏ అప్రూవ్ చేయగా ఇప్పుడు భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ భయపెడుతున్న సందర్భంలో ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందని నిపుణులు చెప్తున్నారు. నానోపోర్ స్లో రిలీజ్ టెక్నాలజీతో రూపొందించబడిన పోర్టబుల్ డిస్‌ఇన్‌ఫెక్షన్ స్టిక్ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ షీల్డ్ మనతో ఉంటే 30 మీటర్ల మేర మనపై వైరస్ ప్రభావం లేనట్లే. ఈ స్టిక్‌ను మెడలో ట్యాగ్‌లా ధరించవచ్చు, క్లాత్‌కు అటాచ్ చేసి యూజ్ చేయొచ్చు, పర్స్ లేదా జేబులోను క్యారీ చేయొచ్చు, కారు, షూస్‌లోనూ అమర్చుకోవచ్చు. స్లో రిలీజ్ టెక్నాలజీతో తయారుచేసిన వైరస్ షీల్డ్‌లో క్లోరిన్ డైఆక్సైడ్ శక్తిమంతమైన క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. ఇది తన పరిధిలోని వైరస్‌లను ఇన్ యాక్టివ్ చేస్తుంది. దీంతో బ్యాక్టీరియా, వైరస్‌లు 99శాతం చనిపోతాయి.

First Published:  19 March 2021 4:28 AM GMT
Next Story