Telugu Global
Cinema & Entertainment

టచప్.. డాక్టర్ చెకప్.. రజినీ సినిమా షూటింగ్ లో విచిత్రాలు..

రజినీకాంత్ కొత్త సినిమా అన్నాత్తే షూటింగ్ చెన్నైలో తిరిగి ప్రారంభమైంది. సహజంగా సినిమా షూటింగ్ అంటే హీరో హీరోయిన్ల పర్సనల్ మేకప్ మెన్ వారి పక్కనే ఉంటారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో మాత్రం పర్సనల్ మేకప్ మ్యాన్ ఓవైపు, మరోవైపు పర్సనల్ డాక్టర్, హీరో రజినీకి తోడుగా ఉంటున్నారు. మేకప్ చెరిగిపోతే వెంటనే టచప్ చేయించుకుంటున్న సూపర్ స్టార్, ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా డాక్టర్ చెకప్ అంటున్నారట. ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో ఆయన […]

టచప్.. డాక్టర్ చెకప్.. రజినీ సినిమా షూటింగ్ లో విచిత్రాలు..
X

రజినీకాంత్ కొత్త సినిమా అన్నాత్తే షూటింగ్ చెన్నైలో తిరిగి ప్రారంభమైంది. సహజంగా సినిమా షూటింగ్ అంటే హీరో హీరోయిన్ల పర్సనల్ మేకప్ మెన్ వారి పక్కనే ఉంటారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో మాత్రం పర్సనల్ మేకప్ మ్యాన్ ఓవైపు, మరోవైపు పర్సనల్ డాక్టర్, హీరో రజినీకి తోడుగా ఉంటున్నారు. మేకప్ చెరిగిపోతే వెంటనే టచప్ చేయించుకుంటున్న సూపర్ స్టార్, ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా డాక్టర్ చెకప్ అంటున్నారట. ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో ఆయన ప్రస్తుతం అన్నాత్తే షూటింగ్ పూర్తి చేస్తున్నారు.

కరోనాకి ముందు రజినీకాంత్ ఒప్పుకున్న సినిమా ఇది, అయితే కరోనా వల్ల బాగా ఆలస్యం అయిపోయింది, ఆ తర్వాత హైదరాబ్ లో సినిమా షూటింగ్ జరుగుతుండగా.. సడన్ గా రజినీ ఆస్పత్రిపాలవడం, రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పడం అందరికీ తెలిసిందే. చాన్నాళ్లపాటు ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు. ఈలోగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యాయి, రజినీ ప్రస్తావన లేకుండానే ప్రచార పర్వంకూడా జరిగిపోతోంది. భావి సీఎంగా అభిమానులంతా ఆశపడిన సూపర్ స్టార్ మాత్రం ఎంచక్కా సినిమా షూటింగ్ కి హాజరవుతున్నారు. గతంలో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు రజినీ విషయంలో మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కుమార్తెల్లో ఎవరో ఒకరు ఆయనకు తోడుగా ఉంటున్నారట. అంతే కాదు, సెట్స్ లో కచ్చితంగా రజినీ పర్సనల్ డాక్టర్ ని ఉంచుతున్నారు. ఇటు మేకప్ మ్యాన్, అటు డాక్టర్, మధ్యలో రజినీకాంత్.. ఇలా జరుగుతోంది అన్నాత్తే సినిమా షూటింగ్.

తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోవడం రజినీకి అలవాటు లేదు. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినా తన పారితోషికం నుంచి వారికి పరిహారం చెల్లించిన సందర్భాలున్నాయి. అలాంటి రజినీ ఆరోగ్య సమస్యల్ని సైతం లెక్క చేయకుండా షూటింగ్ కి హాజరవుతున్నారంటూ అభిమానులు ఆయన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. కొంతమంది మాత్రం రజినీకి అంత సాహసం అవసరమా అని సెటైర్లు వేస్తున్నారు.

First Published:  18 March 2021 8:56 PM GMT
Next Story