Telugu Global
MOVIE REVIEWS

శశి మూవీ రివ్యూ

నటీనటులు: ఆది సాయికుమార్‌, సుర‌భి, రాజీవ్ క‌న‌కాల‌, జ‌య‌ప్ర‌కాష్‌, అజ‌య్‌, వెన్నెల కిశోర్‌, రాశీ సింగ్‌, తుల‌సి, తదితరులు.. ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల‌ నిర్మాత‌లు: ఆర్‌.పి.వ‌ర్మ‌, సి.రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు బ్యానర్: శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సినిమాటోగ్రఫీ: అమ‌ర‌నాథ్ బొమ్మిరెడ్డి మ్యూజిక్‌: అరుణ్ చిలువేరు ఎడిటింగ్‌: స‌త్య జి రన్ టైమ్: 2 గంటల 11 నిమిషాలు రేటింగ్: 1.5/5 హీరో అర్జున్ రెడ్డిలా వ్యవహరిస్తుంటాడు. హీరోయిన్ ‘లేడీ గజనీ’ అయిపోతుంది. హీరోయిన్ తండ్రి బొమ్మరిల్లు […]

sasi pongal poster
X

నటీనటులు: ఆది సాయికుమార్‌, సుర‌భి, రాజీవ్ క‌న‌కాల‌, జ‌య‌ప్ర‌కాష్‌, అజ‌య్‌, వెన్నెల కిశోర్‌, రాశీ సింగ్‌, తుల‌సి, తదితరులు..
ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల‌
నిర్మాత‌లు: ఆర్‌.పి.వ‌ర్మ‌, సి.రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు
బ్యానర్: శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్
సినిమాటోగ్రఫీ: అమ‌ర‌నాథ్ బొమ్మిరెడ్డి
మ్యూజిక్‌: అరుణ్ చిలువేరు
ఎడిటింగ్‌: స‌త్య జి
రన్ టైమ్: 2 గంటల 11 నిమిషాలు
రేటింగ్: 1.5/5

హీరో అర్జున్ రెడ్డిలా వ్యవహరిస్తుంటాడు. హీరోయిన్ ‘లేడీ గజనీ’ అయిపోతుంది. హీరోయిన్ తండ్రి
బొమ్మరిల్లు ఫాదర్. ఇక హీరో ఫ్రెండ్ ఉన్నది ఒకటే జిందగీ సినిమాను గుర్తుచేస్తాడు. జయప్రకాష్
పోషించిన పాత్ర అయితే ఏకంగా ఓ అరడజను సినిమాల్ని గుర్తుకుతెస్తుంది. ఇలా ఓ 10 సినిమాల నుంచి
స్ఫూర్తి పొంది ఈ కథను రాసుకున్నారు. అందులో తప్పు లేదు. కానీ చెప్పిన విధానంలో తప్పంతా ఉంది.
అందుకే శశి సినిమా ఎటూకాకుండా పోయింది.

సినిమాలో పాయింట్ మంచిదే. హీరో ఫ్రెండ్ కు, హీరో లవర్ కు శశి అనే కామన్ నేమ్ పెట్టడం కొత్తగా
ఉంది. కానీ అదే కొత్తదనాన్ని స్క్రీన్ ప్లేలో చూపించి ఉంటే, ఇంతకుముందే చూసేసిన ఎన్నో హిట్
సినిమాలు గుర్తుచేసుకునే అగత్యం తప్పేది. చివరికి క్లైమాక్స్ కోసం పరమ రొటీన్ గా రైల్వేస్టేషన్ కు
వెళ్లిపోయాడంటే.. దర్శకుడు ఇంకా ఏ కాలంలో ఉన్నాడా అనిపిస్తుంది.

ఇక కథ విషయానికొస్తే.. రాజ్ కుమార్ (ఆది సాయికుమార్) జులాయిగా తిరుగుతుంటాడు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు. నచ్చితే మ్యూజిక్ బ్యాండ్ లో పాల్గొంటాడు. తమ్ముడ్ని గాడిలో పెట్టేందుకు అన్నయ్య అజయ్ (అజయ్) విపరీతంగా ప్రయత్నిస్తుంటాడు కానీ తమ్ముడు మారడు. రాజ్ మాత్రం నిత్యం దొర (జయప్రకాష్) ఇంట్లోనే కాలక్షేపం చేస్తుంటాడు. ఇలాంటి టైమ్ లో అనుకోకుండా శశి (సురభి)ని చూస్తాడు రాజ్. ఆమెను చూసిన వెంటనే వెంటపడడం మొదలుపెడతాడు. అప్పటివరకు రెబల్ గా కనిపించిన వ్యక్తి సాఫ్ట్ గా కూడా మారిపోతాడు. ఇంతకీ శశి ఎవరు? రాజ్ జీవితానికి శశికి లింక్ ఏంటి? రాజ్-దొర మధ్య సంబంధం ఏంటి?

ఈ కథకు ఆది కుమార్ సెట్ అయినంతగా సినిమాలో మరే నటుడు తమ పాత్రలకు సెట్ అవ్వకపోవడం బాధాకరం. రాజ్ గా ఆది బాగా నటించాడు. సురభి ఓ షేడ్ లో బాగుంది కానీ, మరో షేడ్ లో నటించాల్సి వచ్చినప్పుడు చేతులెత్తేసింది. మరో హీరోయిన్ రాశి సింగ్ కు నటించడానికి అవకాశం ఇవ్వలేదు దర్శకుడు. కనీసం ఆమెతో గ్లామర్ షో పండించే ప్రయత్నం కూడా చేయలేదు.

టెక్నికల్ గా ఈ సినిమాలో మ్యూజిక్ డైరక్టర్ గురించే చెప్పుకోవాలి. అరుణ్ అందించిన 2 పాటలు బాగున్నాయి. అందులో సిద్ శ్రీరామ్ పాడిన పాట రిలీజ్ కు ముందే బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ అస్సలు బాగాలేదు.

ఫైనల్ గా శశి సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరుస్తుంది.

Next Story