Telugu Global
International

గూగుల్ గో.. తక్కువ డేటాతో ఎక్కువ స్పీడ్

మొబైల్ లో తక్కువ డేటా ఉందా? గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఎక్కువ స్పేస్ తీసుకుంటోందా.. అయితే దీనికి ప్రత్యామ్నాయంగానే గూగుల్ ఓ కొత్త బ్రౌజర్ ను రూపొందించింది. దానిపేరే గూగుల్ గో.. ఇది అత్యంత తక్కువ డేటాను వినియోగించుకుంటూ స్పీడ్ గా పని చేస్తుంది. అంతేకాదు దీని స్టోరేజ్ స్పేస్ కూడా తక్కువే.. గూగుల్ సెర్చ్ కు ఆల్టర్నేటివ్ గా రూపొందించిన గూగుల్ గో ఇప్పుడు కోట్ల డౌన్ లోడ్స్ తో దూసుకెళ్తోంది. గూగుల్ సెర్చ్ తో […]

గూగుల్ గో.. తక్కువ డేటాతో ఎక్కువ స్పీడ్
X

మొబైల్ లో తక్కువ డేటా ఉందా? గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఎక్కువ స్పేస్ తీసుకుంటోందా.. అయితే దీనికి ప్రత్యామ్నాయంగానే గూగుల్ ఓ కొత్త బ్రౌజర్ ను రూపొందించింది. దానిపేరే గూగుల్ గో.. ఇది అత్యంత తక్కువ డేటాను వినియోగించుకుంటూ స్పీడ్ గా పని చేస్తుంది. అంతేకాదు దీని స్టోరేజ్ స్పేస్ కూడా తక్కువే..

గూగుల్ సెర్చ్ కు ఆల్టర్నేటివ్ గా రూపొందించిన గూగుల్ గో ఇప్పుడు కోట్ల డౌన్ లోడ్స్ తో దూసుకెళ్తోంది. గూగుల్ సెర్చ్ తో పోలిస్తే ఇది తక్కువ డేటాతో అత్యంత వేగంగా పని చేస్తుంది. పరిమితమైన డేటా స్పీడ్, డేటా లిమిట్స్ తో ఇంటర్నెట్ వాడుకునే వాళ్లకు గూగుల్ గో యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ గో ఓఎస్ ద్వారా విడుదలైంది. అందుకే దీనిపేరుని ‘గూగుల్ గో’ అని పెట్టారు.
ఈ యాప్ గూగుల్ సెర్చ్ కంటే స్పీడ్ గా పనిచేస్తుంది. అలా అని సెర్చ్ రిజల్ట్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. లైట్ వెర్షన్స్ లా ఉండదు. అన్ని యాక్సెస్ లు ఉంటాయి. దీని స్టోరేజ్ స్పేస్ కేవలం 8 ఎంబీ మాత్రమే. ఇలాంటి ఫీచర్ల కారణంగా ఈ యాప్ ఇప్పటికే 50 కోట్ల డౌన్ లోడ్ లను క్రాస్ చేసింది. ఇంకా డౌన్ లోడ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది.

First Published:  19 March 2021 3:58 AM GMT
Next Story