Telugu Global
NEWS

చంద్రబాబు అన్నింటికీ అతీతుడా? ఎస్సీ, ఎస్టీ చట్టం ఎందుకు వర్తించదు? నాని

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడికి సీఐడీ నోటీసులు ఇస్తే టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. ఆయనేమైనా అన్నింటికీ అతీతుడా అంటూ సెటైర్​ వేశారు. రాజధానిలోని అసైన్డ్​ భూముల విషయంలో విచారణకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటిసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. […]

చంద్రబాబు అన్నింటికీ అతీతుడా? ఎస్సీ, ఎస్టీ చట్టం ఎందుకు వర్తించదు? నాని
X

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడికి సీఐడీ నోటీసులు ఇస్తే టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. ఆయనేమైనా అన్నింటికీ అతీతుడా అంటూ సెటైర్​ వేశారు. రాజధానిలోని అసైన్డ్​ భూముల విషయంలో విచారణకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటిసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

ఎస్సీలను దూషించినా.. ఎస్సీ ఎస్టీ ఆస్తులు కాజేసినా అది అట్రాసిటీ చట్టం కిందకే వస్తుందన్నారు. అప్పట్లో కొందరు నేతలు ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్​ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. అధికారులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి వాటిని రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారని, ఆతర్వాత మళ్లీ ఆ భూములను ల్యాండ్​ పూలింగ్​ కింద ప్రభుత్వానికి ఇచ్చేసి లబ్ధి పొందారని ఆయన ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా సీఐడీ చంద్రబాబుకు నోటీసులు ఇస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చారు. రాజధానిలోని అసైన్డ్​ భూముల విషయంలో విచారణకు సంబంధించి 41 సీఆర్​పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. అప్పుడు చంద్రబాబు స్టేట్​మెంట్​ తీసుకోనున్నారు. చంద్రబాబుతో పాటు అప్పటి మంత్రి నారాయణకు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ విషయం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

టీడీపీ నేతలు లోకేశ్​, అచ్చెన్నాయుడు ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపే అంటూ విమర్శించారు. మరోవైపు వైసీసీ నేతలు మాత్రం చట్ట ప్రకారమే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. కాగా ఈ నోటీసులపై చంద్రబాబు న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్టు సమాచారం.

First Published:  16 March 2021 7:19 AM GMT
Next Story