Telugu Global
National

విదేశీ టూర్‌‌కి వ్యాక్సిన్ తప్పనిసరి

సమ్మర్‌‌లో విదేశీ టూరేద్దామనుకుంటున్నవాళ్లకి కొన్ని దేశాలు వెల్‌కమ్ చెప్తున్నాయి. అయితే ఎలాంటి కోవిడ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా హాయిగా వెళ్లిరావాలంటే వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుందంటున్నాయి. మహమ్మారి కారణంగా నష్టపోయిన చాలా దేశాలు. పర్యాటక రంగం ద్వారా తిరిగి కోలుకోవాలని చూస్తున్నాయి. ఇందులోభాగంగానే టూరిస్టులకు వెల్‌కమ్ చెప్తున్నాయి. అయితే కోవిడ్ ఇబ్బందులు లేకుండా వ్యాక్సిన్ వేయించుకుని రమ్మంటున్నాయి. థాయ్‌లాండ్: థాయ్‌లాండ్‌ ఇప్పుడు విదేశీ టూరిస్ట్‌లకు స్వాగతం పలుకుతోంది. వ్యాక్సిన్ వేసుకున్న విదేశీ పర్యాటకులు క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. […]

విదేశీ టూర్‌‌కి వ్యాక్సిన్ తప్పనిసరి
X

సమ్మర్‌‌లో విదేశీ టూరేద్దామనుకుంటున్నవాళ్లకి కొన్ని దేశాలు వెల్‌కమ్ చెప్తున్నాయి. అయితే ఎలాంటి కోవిడ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా హాయిగా వెళ్లిరావాలంటే వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుందంటున్నాయి.
మహమ్మారి కారణంగా నష్టపోయిన చాలా దేశాలు. పర్యాటక రంగం ద్వారా తిరిగి కోలుకోవాలని చూస్తున్నాయి. ఇందులోభాగంగానే టూరిస్టులకు వెల్‌కమ్ చెప్తున్నాయి. అయితే కోవిడ్ ఇబ్బందులు లేకుండా వ్యాక్సిన్ వేయించుకుని రమ్మంటున్నాయి.
థాయ్‌లాండ్:
థాయ్‌లాండ్‌ ఇప్పుడు విదేశీ టూరిస్ట్‌లకు స్వాగతం పలుకుతోంది. వ్యాక్సిన్ వేసుకున్న విదేశీ పర్యాటకులు క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. వ్యాక్సిన్ ఉంటే క్వారెంటైన్ నిబంధలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
సీషెల్స్:
వ్యాక్సిన్ వేసుకున్న విదేశీ పర్యాటకులకు తమ దేశంలో క్వారెంటైన్‌ నిబంధనలు వర్తించవని సీషెల్స్ కూడా ప్రకటిచింది. వ్యాక్సిన్ వేసుకున్నట్టు సంబంధిత హెల్త్ అథారిటీ నుంచి ధ్రువీకరణ పత్రం, కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ చూపిస్తే ఈ దేశంలో స్వేచ్ఛగా పర్యటించొచ్చు.
గ్రీస్:
వ్యాక్సిన్ పొందినట్టు ధ్రువపత్రాలను చూపిస్తే తమ దేశంలోకి అనుమతిస్తామని గ్రీస్ ప్రకటించింది. వ్యాక్సిన్ పొందిన అంతర్జాతీయ ప్రయాణికులు మే 14 తర్వాత గ్రీస్ దేశాన్ని పర్యటించొచ్చు.
రొమేనియా:
రొమేనియా కొవిడ్ తీవ్రతను బట్టి ప్రపంచ దేశాలకు ర్యాకింగ్ ఇచ్చింది. ఎక్కువగా కేసులు నమోదవుతున్న దేశాలను రెడ్ లిస్ట్‌లో, కరోనా ప్రభావం తక్కువగా ఉన్న దేశాలను ఎల్లో లిస్ట్‌లో చేర్చింది. ఎల్లో లిస్ట్‌లో ఉన్నదేశాలకు చెందిన విదేశీ పర్యటకులు వ్యాక్సిన్ వేయించుకున్నట్టయితే.. వారు తమ దేశంలో ఎలాంటి నిబంధనలు లేకుండా పర్యటించొచ్చని పేర్కొంది.

First Published:  15 March 2021 2:55 AM GMT
Next Story