Telugu Global
NEWS

ఏపీలో మళ్లీ కరోనా పంజా.. స్కూల్ మూసివేత..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులోకి వచ్చేసింది. మిగతా చోట్ల ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ దశలో ఏపీలో కూడా వారం రోజులుగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దాదాపుగా 10 జిల్లాల్లో రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల కనపడుతోంది. ఈ దశలో గుంటూరు జిల్లా పొన్నూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు 8మంది ఒకేసారి కరోనాబారిన పడటం, ఆ స్కూల్ మూసివేయడంతో […]

ఏపీలో మళ్లీ కరోనా పంజా.. స్కూల్ మూసివేత..
X

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులోకి వచ్చేసింది. మిగతా చోట్ల ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ దశలో ఏపీలో కూడా వారం రోజులుగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దాదాపుగా 10 జిల్లాల్లో రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల కనపడుతోంది. ఈ దశలో గుంటూరు జిల్లా పొన్నూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు 8మంది ఒకేసారి కరోనాబారిన పడటం, ఆ స్కూల్ మూసివేయడంతో కలకలం రేగింది. కరోనా సోకిన విద్యార్థులందర్నీ హోమ్ క్వారంటైన్ లో ఉంచి, స్కూల్ మూసివేసి శానిటైజ్ చేయిస్తున్నారు అధికారులు. స్కూల్ ఏరియాని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.

లాక్ డౌన్, క్వారంటైన్, కంటైన్మెంట్.. ఈ పదాలన్నీ పాతబడిపోయాయి అనుకుంటున్న తరుణంలో.. ఏపీలో కూడా మళ్లీ భయం భయంగా తిరిగే రోజులొచ్చేస్తున్నాయి. ఇన్నాళ్లూ పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయనుకున్నారే కానీ, ఇప్పుడు ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా స్కూల్స్ విషయంలో ప్రభుత్వం కానీ, పేరెంట్స్ కానీ ఏపీలో ధైర్యంగా ఉన్నారు. ఇతర రాష్ట్రాలకంటే ముందుగా ఏపీలోనే స్కూల్స్ తిరిగి మొదలయ్యాయి. రోజు మార్చి రోజు క్లాసులు దగ్గర్నుంచి రోజూ క్లాసులు చెప్పే రోజులొచ్చేశాయి. ప్రైమరీ సెక్షన్ కూడా మొదలు కావడంతో పిల్లల సందడి పెరిగింది. పొరుగున ఉన్న తెలంగాణలో ఇంకా ప్రైమరీ సెక్షన్ ప్రారంభించాడానికి అధికారులు కానీ, అధినేతలు కానీ ధైర్యం చేయడంలేదు.

ఏపీలో మాత్రం అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న టైమ్ లో మరోసారి కరోనా పంజా విసిరింది. పొన్నూరు స్కూల్ లో పిల్లలకు కరోనా రావడంతో.. ఇప్పుడు పట్టణంలోని మిగతా స్కూల్స్ లో కూడా విద్యార్థులు భయపడుతున్నారు. పిల్లల్ని బడికి పంపించడానికి తల్లిదండ్రులకు కూడా ధైర్యం చాలడంలేదు. ఆదివారం ఒక్కరోజే గుంటూరు లో 48కేసులు నమోదయ్యాయి. స్కూల్ పిల్లలతోపాటు, పొన్నూరులోని ముగ్గురికి కరోనా సోకింది. తెనాలి మున్సిపల్ ఆఫీస్ లో ఏకంగా 8మంది కరోనా బారిన పడ్డారు. మున్సిపల్ ఆఫీస్ మేనేజర్, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ నెల 10న మున్సిపల్‌ ఎన్నికల విధులకు వీరంతా హాజరయ్యారు. దీంతో వీరితో కలసి పనిచేసినవారిలో టెన్షన్ మొదలైంది. వారందరి వివరాలు తీసుకుంటున్న అధికారులు, వారి ఆరోగ్య పరిస్థితి ఆరా తీస్తున్నారు. దీంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజల్ని కరోనా భయం వెంటాడుతోంది. ఏపీ మొత్తం అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.

First Published:  14 March 2021 9:37 PM GMT
Next Story