Telugu Global
NEWS

కాంగ్రెస్​కు బిగ్​ షాక్​.. బీజేపీలోకి కొండా

కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్​బై చెబుతున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్​ఎస్​లో చేరారు. తాజాగా సీనియర్​ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి కాంగ్రెస్​కు షాక్​ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డికి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. చాలా రోజుల క్రితమే కొండా పార్టీని వీడాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీని వీడితే కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డికి నష్టం […]

కాంగ్రెస్​కు బిగ్​ షాక్​.. బీజేపీలోకి కొండా
X

కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్​బై చెబుతున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్​ఎస్​లో చేరారు. తాజాగా సీనియర్​ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి కాంగ్రెస్​కు షాక్​ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డికి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. చాలా రోజుల క్రితమే కొండా పార్టీని వీడాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీని వీడితే కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డికి నష్టం కలుగుతుందని ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు సమాచారం.

ఆయన త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొండా విశ్వేశ్వర్​రెడ్డి తొలిసారి 2014 ఎన్నికల్లో టీఆర్​ఎస్​ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​పార్టీలో చేరారు. అప్పట్లో టీఆర్​ఎస్​ మంత్రి కేటీఆర్​తో విబేధాలు రావడం వల్లే కొండా పార్టీని వీడినట్టు వార్తలు వచ్చాయి.

అయితే 2019లో నిర్వహించిన పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ టికెట్​ మీద చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్​రెడ్డి పోటీచేశారు. అయితే సల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి చాలా ఆయన కాంగ్రెస్​ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. యూట్యూబ్​లో వీడియోలు చేస్తూ వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.అయితే ఆయన తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

కాంగ్రెస్​ నేతల్లో అసంతృప్తి..!
దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్​ నేతలు, క్యాడర్ చతికిల పడ్డారు. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్​ కుమార్​రెడ్డి రాజీనామా ప్రకటించినప్పటికీ కాంగ్రెస్​ అధిష్ఠానం ఆమోదించలేదు. కొత్త అధ్యక్షుడిని కూడా నియమించలేదు. దీంతో క్యాడర్​ తీవ్ర అసంతృప్తితో ఉంది. మరోవైపు కాంగ్రెస్​ అధిష్ఠానం మాత్రం ఈ విషయంలో ఇంతవరకు స్పందించడం లేదు.

First Published:  15 March 2021 7:22 AM GMT
Next Story