గ్లామర్ రోల్స్ కావాలంటున్న హీరోయిన్
కొంతమంది హీరోయిన్లు అందంగా ఉంటారు. కానీ ఎందుకో వాళ్లకు గ్లామర్ రోల్స్ రావు. హీరోయిన్ సురభి పరిస్థితి కూడా ఇదే. ఆమెకు గ్లామర్ పాత్రలు రావట్లేదనే బాధ ఉంది. ఇదే విషయాన్ని మీడియా ముందు బయటపెట్టింది ఈ భామ. “గ్లామరస్ రోల్స్ చేయడానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటాను. ఇండస్ట్రీలోని గ్రేట్ పీపుల్స్ అందరితో వర్క్ చేయాలని కోరుకుంటు న్నాను. అలాగే మైథాలాజికల్ మూవీస్ లో నటించడం ఇష్టం. వెబ్ సిరీస్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాను. కొన్ని ఆఫర్లు […]

కొంతమంది హీరోయిన్లు అందంగా ఉంటారు. కానీ ఎందుకో వాళ్లకు గ్లామర్ రోల్స్ రావు. హీరోయిన్ సురభి పరిస్థితి కూడా ఇదే. ఆమెకు గ్లామర్ పాత్రలు రావట్లేదనే బాధ ఉంది. ఇదే విషయాన్ని మీడియా ముందు బయటపెట్టింది ఈ భామ.
“గ్లామరస్ రోల్స్ చేయడానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటాను. ఇండస్ట్రీలోని గ్రేట్ పీపుల్స్ అందరితో వర్క్ చేయాలని కోరుకుంటు న్నాను. అలాగే మైథాలాజికల్ మూవీస్ లో నటించడం ఇష్టం. వెబ్ సిరీస్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాను. కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను. అలాంటివి వస్తే వెబ్ సిరీస్ కూడా చేస్తాను.”
ఆదితో కలిసి ఆమె చేసిన శశి సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో సురభిది ఒక డామినేటింగ్ పర్సనాలిటీ. అయితే ఈ సినిమాలో తన క్యారెక్టర్లో మరో షేడ్ కూడా ఉంటుంది. అదేంటన్నది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాలంటోంది.