Telugu Global
National

చేపాక్​ నుంచి ఉదయనిధి.. తాత పోటీచేసిన స్థానం నుంచే..!

తమిళనాడు రాజకీయాలంటేనే ఎంతో విభిన్నం.. వాళ్ల ప్రచారశైలి.. ఆర్భాటాలు, హంగులు, సినీ గ్లామర్​ అక్కడి ఎన్నికలు ఎంతో కలర్​ఫుల్​గా సాగుతుంటాయి. ప్రచార జిమ్మిక్కులు, ఉచిత హామీలు, విభిన్న ప్రచారాలు కూడా అక్కడే ఎక్కువ. దీంతో తమిళనాడు ఎన్నికలపై ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంటుంది. ఈ సారి ఇద్దరు మహానేతలు లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. దిగ్గజ నేతలు జయలలిత, కరుణానిధి మరణాంతరం ఈ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా పార్టీలు బరిలో నిలిచినప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ప్రధాన […]

చేపాక్​ నుంచి ఉదయనిధి.. తాత పోటీచేసిన స్థానం నుంచే..!
X

తమిళనాడు రాజకీయాలంటేనే ఎంతో విభిన్నం.. వాళ్ల ప్రచారశైలి.. ఆర్భాటాలు, హంగులు, సినీ గ్లామర్​ అక్కడి ఎన్నికలు ఎంతో కలర్​ఫుల్​గా సాగుతుంటాయి. ప్రచార జిమ్మిక్కులు, ఉచిత హామీలు, విభిన్న ప్రచారాలు కూడా అక్కడే ఎక్కువ. దీంతో తమిళనాడు ఎన్నికలపై ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంటుంది. ఈ సారి ఇద్దరు మహానేతలు లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. దిగ్గజ నేతలు జయలలిత, కరుణానిధి మరణాంతరం ఈ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా పార్టీలు బరిలో నిలిచినప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ప్రధాన పోటీ నెలకొని ఉంది.

శశికళ తప్పుకోవడంతో అన్నాడీఎంకేకు కొంత లైన్​ క్లియర్​ అయింది. ఇదిలా ఉంటే తాజాగా డీఎంకే తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. డీఎంకే అధినేత స్టాలిన్​ కొలతూరు నుంచి బరిలో దిగుతున్నారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్​ చేపాక్​ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.

చేపాక్​ నియోజకవర్గంలో గతంలో గతంలో దివంగత నేత కరుణానిధి పోటీచేసేవారు. దీంతో ఈ ఇప్పుడు ఈ స్థానంపై ఆసక్తి నెలకొన్నది. ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో డీఎంకే ఇంటర్వ్యూలు చేస్తు వస్తున్నది. పార్టీ వ్యవస్థాపకుడు కరుణానిధి టైంలోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇటీవల అభ్యర్థుల ఎంపిక లో భాగంగా ఉదయనిధి స్టాలిన్​ను డీఎంకే బృందం ఇంటర్వ్యూ చేసింది. ఆ తర్వాత ఆయన ఇంటర్వ్యూలో సెలెక్ట్​ కాలేదని.. అందుకే ఆయన పోటీచేయకపోవచ్చని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా చేపాక్​ స్థానం నుంచి ఉదయనిధి స్టాలిన్​ పోటీచేయబోతున్నట్టు స్టాలిన్​ ప్రకటించారు.

మరోవైపు సీనియర్లకు మొదటి జాబితాలో చోటు దక్కింది. కే ఎన్ నెహ్రూ త్రిచీ నుంచి, సెంథిల్ బాలాజీ కరూర్ నుంచి, టీఆర్‌బీ రాజా మన్నార్ గూడి నియోజకవర్గం నుంచి, తంగా తమిళ్ సెల్వన్ బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.

First Published:  12 March 2021 9:40 AM GMT
Next Story