Telugu Global
Cinema & Entertainment

సుక్కూ బ్యాచ్ నుంచి మరో డైరక్టర్

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాత‌గా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ మీద‌ వినూత్న‌మైన సినిమాల్ని నిర్మిస్తూ సినీ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ పై వ‌చ్చిన కుమారి 21 ఎఫ్, ఉప్పెన వంటి చిత్రాలు బ్లాక్ బ‌స్టర్స్ గా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో మార్చి 19న విడుద‌ల అవ్వ‌నున్న కార్తికేయ అప్ క‌మింగ్ మూవీ చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ని చూసి అందులో కార్తికేయ పెర్ఫార్మెన్స్ కి ఇంప్ర‌స్ అయి సుకుమార్ […]

సుక్కూ బ్యాచ్ నుంచి మరో డైరక్టర్
X

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాత‌గా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ మీద‌ వినూత్న‌మైన సినిమాల్ని
నిర్మిస్తూ సినీ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ పై వ‌చ్చిన కుమారి 21 ఎఫ్,
ఉప్పెన వంటి చిత్రాలు బ్లాక్ బ‌స్టర్స్ గా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో మార్చి 19న విడుద‌ల అవ్వ‌నున్న
కార్తికేయ అప్ క‌మింగ్ మూవీ చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ని చూసి అందులో
కార్తికేయ పెర్ఫార్మెన్స్ కి ఇంప్ర‌స్ అయి సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ పై ఓ సినిమాను నిర్మించ‌డానికి
క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్లాన్ చేశారు.

న‌వంబ‌ర్ లో ప్రారంభం అవ్వ‌నున్న ఈ సినిమాకి క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు సుకుమార్ అందిస్తున్నారు. ద‌ర్శకుడు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తారు. సుకుమార్ వద్ద రంగస్థలం సినిమాకు పనిచేసిన బుచ్చిబాబు, ఉప్పెనతో దర్శకుడు అయ్యాడు. ఇప్పుడు అదే రంగస్థలం సినిమాకు పనిచేసిన మరో రైటర్ ను దర్శకుడిగా సుకుమార్ పరిచయం చేయబోతున్నాడు.

నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఉప్పెన తరహాలోనే ఓ భారీ బ్యానర్ తో
కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

First Published:  12 March 2021 6:50 AM GMT
Next Story