Telugu Global
NEWS

కొత్త ఆధార్ కార్డుకి అప్లై చేశారా?

డెబిట్ కార్డు సైజులో వస్తున్న కొత్త ఆధార్ కార్డుకు అప్లై చేశారా? అంతకుముందులా పేపర్‌‌తో తయారయ్యే కార్డులు కాకుండా చిన్న సైజులో, బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల సైజులో కొత్త ఆధార్ కార్డులు వస్తున్నాయి. ఈ కొత్త కార్డు కావాలంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. కొత్తగా వస్తున్న పివీసీ(పాలి వినైల్ క్లోరైడ్) ఆధార్ కార్డుపై క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్ కూడా ఉంటుంది. ఈ కొత్త పీవీసీ ఆధార్ కార్డు కోసం అప్లై ఎలా చేసుకోవాలంటే.. ముందుగా UIDAI […]

కొత్త ఆధార్ కార్డుకి అప్లై చేశారా?
X

డెబిట్ కార్డు సైజులో వస్తున్న కొత్త ఆధార్ కార్డుకు అప్లై చేశారా? అంతకుముందులా పేపర్‌‌తో తయారయ్యే కార్డులు కాకుండా చిన్న సైజులో, బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల సైజులో కొత్త ఆధార్ కార్డులు వస్తున్నాయి. ఈ కొత్త కార్డు కావాలంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

కొత్తగా వస్తున్న పివీసీ(పాలి వినైల్ క్లోరైడ్) ఆధార్ కార్డుపై క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్ కూడా ఉంటుంది. ఈ కొత్త పీవీసీ ఆధార్ కార్డు కోసం అప్లై ఎలా చేసుకోవాలంటే..
ముందుగా UIDAI వెబ్‌సైట్(https://uidai.gov.in/) ను విజిట్ చేయాలి.
Get Aadhaar అనే ఆప్షన్ కింద Order Aadhaar PVC Card ఉంటుంది. అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయ‌గానే కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంట‌ర్ చేయాలి. ఆధార్ నెంబర్ బదులుగా వ‌ర్చువ‌ల్ ఐడీ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ కూడా ఎంట‌ర్ చేయొచ్చు. తర్వాత క్యాప్చా (Captcha)ను ఎంట‌ర్ చేసి.. సెండ్ ఓటీపీ (Send OTP) పై క్లిక్ చేయాలి.
ఆధార్ కార్డుతో మీ మొబైల్ నంబ‌ర్ లింక్ అయ్యి ఉంటే వెంటనే మీ మొబైల్‌కు ఒక మెసేజ్ వ‌స్తుంది. ఆ ఓటీపీని ఎంట‌ర్ చేసి ‘Submit’ నొక్కాలి.

అప్పుడు ఫొటోతో స‌హా వివ‌రాలన్నీ వెబ్‌సైట్ పేజిపై క‌నిపిస్తాయి. స‌రిచూసుకున్న త‌ర్వాత‌ Make Paymentపై క్లిక్ చేయాలి. రకరకాల పేమెంట్ మెథడ్స్‌లో పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ పూర్తయిన త‌ర్వాత రిసిప్ట్ వ‌స్తుంది. అంతే.. SRN నంబ‌ర్‌ను సేవ్ చేసుకుంటే సరి. ప‌ది రోజుల్లో సరికొత్త పీవీసీ ఆధార్ కార్డు అడ్రస్‌కు వచ్చేస్తుంది.

First Published:  9 March 2021 3:59 AM GMT
Next Story