Telugu Global
NEWS

షర్మిల వర్సెస్ టీఆర్ఎస్..

వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పై ప్రకటన చేసిన తర్వాత రాజకీయ పరిణామాలన్నీ చకచకా జరిగిపోతున్నాయి. వైఎస్ఆర్ అభిమానులు, ఆయనతో కలసి పనిచేసినవారు, మాజీలు, వారసులు.. ఇలా చాలామంది షర్మిల కూటమివైపు చూస్తున్నారు. ఆల్రడీ ఆమెతో కలసి రాజకీయ ప్రయాణం మొదలు పెట్టేశారు. అయితే షర్మిల పార్టీతో అత్యథికంగా నష్టపోయేది ఎవరనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షర్మిల, టీఆర్ఎస్ పై బీజేపీ వదిలిన బాణమా, […]

షర్మిల వర్సెస్ టీఆర్ఎస్..
X

వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పై ప్రకటన చేసిన తర్వాత రాజకీయ పరిణామాలన్నీ చకచకా జరిగిపోతున్నాయి. వైఎస్ఆర్ అభిమానులు, ఆయనతో కలసి పనిచేసినవారు, మాజీలు, వారసులు.. ఇలా చాలామంది షర్మిల కూటమివైపు చూస్తున్నారు. ఆల్రడీ ఆమెతో కలసి రాజకీయ ప్రయాణం మొదలు పెట్టేశారు. అయితే షర్మిల పార్టీతో అత్యథికంగా నష్టపోయేది ఎవరనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షర్మిల, టీఆర్ఎస్ పై బీజేపీ వదిలిన బాణమా, లేక కాంగ్రెస్ పై టీఆర్ఎస్ వదిలిన బాణమా.. అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అసలు తానెవరూ వదిలిన బాణాన్ని కాదని, తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించేందుకే వచ్చానంటూ షర్మిల చెప్పడం కూడా ఆలోచించాల్సిన విషయమే. అయితే టీఆర్ఎస్ లో కాస్తో కూస్తో కలవరం రేగిన విషయాన్ని మాత్రం కాదనలేం. షర్మిల స్థానికత ప్రశ్నిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీలోని అభద్రతా భావం బయటపడింది.

వైఎస్ విగ్రహం ధ్వంసంతో మొదలైన అలజడి..
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం శివాయిగూడెంలోని వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపింది. వైఎస్ కుటుంబం అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. షర్మిల ఫొటోలతో హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహం వద్ద షర్మిల మద్దతుదారులు నిరసన ప్రదర్శన చేపట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తన పాదయాత్ర సందర్భంగా వైఎస్ షర్మిల స్వయంగా ఆవిష్కరించిన విగ్రహం కావడంతో దానిపై ఆమెకు సెంటిమెంట్ ఉంది. ఖమ్మం కేంద్రంగా షర్మిల రాజకీయ ప్రస్థానం మొదలవుతుందని, పార్టీ ప్రకటన కూడా అక్కడినుంచే జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో విగ్రహం ధ్వంసం వ్యవహారం సంచలనంగా మారింది. దీంతో షర్మిల తన మద్దతుదారులతో ఆందోళనకు దిగే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా హైదరాబాద్ లో తమకు బలం ఉందని నిరూపించుకునేందుకు పంజాగుట్టలో ఆందోళన మొదలు పెట్టారు. దీన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలనే ఆలోచన కూడా వారిలో ఉంది. అయితే షర్మిల మద్దతుదారులు చేస్తున్న ఆందోళనపై కేసీఆర్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

First Published:  7 March 2021 8:48 PM GMT
Next Story