Telugu Global
National

హమ్మయ్య లెక్క తేలింది.. డీఎంకే, కాంగ్రెస్​ మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు..!

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తానికి డీఎంకే 180 స్థానాల్లో.. కాంగ్రెస్​ 25 స్థానాల్లో పోటీచేయబోతున్నాయి. కాంగ్రెస్​కు అధికసంఖ్యలో సీట్లు ఇచ్చేందుకు డీఎంకే అధినేత మొదట్లో స్టాలిన్​ ఒప్పుకోలేదు. కాంగ్రెస్​ మొత్తం 40 స్థానాలు కావాలని పట్టుబట్టింది. అయితే స్టాలిన్​ చేయించుకున్న ఓ సర్వే ప్రకారం.. తమిళనాడులో కాంగ్రెస్​ గ్రాఫ్​ తగ్గిపోయిందట. ఒకవేళ ఆ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే.. అక్కడ ఇతరులు గెలిచి […]

హమ్మయ్య లెక్క తేలింది.. డీఎంకే, కాంగ్రెస్​ మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు..!
X

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తానికి డీఎంకే 180 స్థానాల్లో.. కాంగ్రెస్​ 25 స్థానాల్లో పోటీచేయబోతున్నాయి. కాంగ్రెస్​కు అధికసంఖ్యలో సీట్లు ఇచ్చేందుకు డీఎంకే అధినేత మొదట్లో స్టాలిన్​ ఒప్పుకోలేదు. కాంగ్రెస్​ మొత్తం 40 స్థానాలు కావాలని పట్టుబట్టింది. అయితే స్టాలిన్​ చేయించుకున్న ఓ సర్వే ప్రకారం.. తమిళనాడులో కాంగ్రెస్​ గ్రాఫ్​ తగ్గిపోయిందట. ఒకవేళ ఆ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే.. అక్కడ ఇతరులు గెలిచి అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని స్టాలిన్​ లెక్కలు వేసుకున్నారు.

దీంతో ఆయన కాంగ్రెస్​ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా లేరు. అయితే కాంగ్రెస్​ మాత్రం తమకు తగినన్ని సీట్లు కావాల్సిందేనంటూ పట్టుబట్టింది. దీంతో ఇరుపార్టీల మధ్య ఎడతెగని చర్చలు జరిగాయి. చివరకు ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్​కు 25 స్థానాలు ఇచ్చేందుకు డీఎంకే ఒప్పుకున్నది. కన్యాకుమారి లోక్​సభ స్థానంలోనూ కాంగ్రెస్​ పోటీచేయనున్నది.

మొదట్లో కాంగ్రెస్​ నేతలు 41 స్థానాలు డిమాండ్​ చేశారు. అయితే డీఎంకే 20 సీట్లే కేటాయించడంతో కాంగ్రెస్​ అలకబూనింది. ఓ దశలో కాంగ్రెస్​ అధ్యక్షుడు కేఎస్​ అళగిరి డీఎంకే తీరుపట్ల తీవ్ర మనస్తాపం చెంది కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. కాంగ్రెస్​, డీఎంకే తెగదెంపులు చేసుకుంటాయన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఎట్టకేలకు చర్చలు ఫలించాయి.

చివరకు కాంగ్రెస్​ పార్టీ ఓ మెట్టుదిగడం, డీఎంకే మరో ఐదు సీట్లు కేటాయించడంతో వివాదానికి తెరపడింది. రాహుల్ గాంధీ జోక్యంతో వివాదం సద్దుమణిగిందని సమాచారం. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పరిస్థితిని డీఎంకే అధినేత స్టాలిన్​.. రాహుల్​కు వివరించారట. రాహుల్​ కూడా స్టాలిన్​ వాదనతో ఏకీభవించనట్టు సమాచారం.

First Published:  8 March 2021 1:33 AM GMT
Next Story