Telugu Global
Others

ఇల్లు చల్లగా ఉండాలంటే..

చూస్తుండగానే ఎండలు మొదలయ్యాయి. శివరాత్రి తర్వాత పూర్తి స్థాయిలో ఎండలు మండిపోయే అవకాశం ఉంది. సమ్మర్ లో ఎక్కువ‌ సమయం ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అందుకే దానికోసం ఇంటిని చల్లగా ఉండేలా చూసుకోవాలి. అదెలాగంటే.. వేసవిలో ఇంటి కూలింగ్ కోసం ఏసీ, కూలర్ల వాడకం ఎలాగూ ఉంటుంది. వాటితో పాటు మరికొన్ని టిప్స్ ద్వారా సహజంగానే ఇంటి వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. మొక్కలతో.. మొక్కలు, చెట్లు ఉన్న ఇంటి వాతావరణం ఆటోమేటిక్ గా చల్లగా మారిపోతుంది. […]

ఇల్లు చల్లగా ఉండాలంటే..
X

చూస్తుండగానే ఎండలు మొదలయ్యాయి. శివరాత్రి తర్వాత పూర్తి స్థాయిలో ఎండలు మండిపోయే అవకాశం ఉంది. సమ్మర్ లో ఎక్కువ‌ సమయం ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అందుకే దానికోసం ఇంటిని చల్లగా ఉండేలా చూసుకోవాలి. అదెలాగంటే..

వేసవిలో ఇంటి కూలింగ్ కోసం ఏసీ, కూలర్ల వాడకం ఎలాగూ ఉంటుంది. వాటితో పాటు మరికొన్ని టిప్స్ ద్వారా సహజంగానే ఇంటి వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవచ్చు.

మొక్కలతో..
మొక్కలు, చెట్లు ఉన్న ఇంటి వాతావరణం ఆటోమేటిక్ గా చల్లగా మారిపోతుంది. చెట్లు ఎక్కువగా ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల కంటే రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందుకే ఇంటి చుట్టూ మొక్కలు పెంచడం వల్ల వేడి తగ్గించుకోవచ్చు. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే అదంతా చెట్లతో నింపడం మంచిది. అలాగే ఇంటి పైకప్పుపై చిన్నపాటి తోటను పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం. దీనినే రూఫ్‌ టాప్‌ గార్డెన్‌ అంటారు. అపార్టుమెంట్లు అయితే బాల్కనీలో కుండీలు పెట్టుకుని.. వాటిలోనూ మొక్కలు పెంచొచ్చు.

పరదాల చల్లగా..
కిటికీలు, తలుపులకు నారతో చేసిన చాపలను వాడటం వల్ల ఇంట్లోకి వేడి గాలి రాకుండా చూసుకోవచ్చు. వాటిని తరచూ నీటితో తడుపుతూ ఉంటే ఇంకా చల్లగా ఉంటుంది. తెరచాపలే కాకుండా కూలర్లలో వినియోగించే గడ్డి చాపలు, మ్యాట్లు కూడా మార్కెట్లో లభిస్తాయి. అవి నీటిని ఎక్కువ సేపు పట్టి ఉంచుతాయి. ఇంట్లో చల్లదనాన్ని కలిగించే కొత్త తరహా పాలిమర్‌ లు కూడా ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. ఇవి సూర్యరశ్మిని చాలా వరకు తగ్గిస్తాయి

మరికొన్ని..
వేసవిలో పగటిపూట ఓవర్‌ హెడ్‌ ట్యాంకులో నీరు లేకుండా చూసుకోవాలి. తగినంత నీరు టబ్బుల్లో, బక్కెట్లలో నీళ్లు నిల్వ చేసుకుని బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం లాంటి పనులకు వాడుకోవాలి. లేదంటే వేడెక్కిన నీటివల్ల కప్పు, గోడల్లోని పైపుల ద్వారా గదులన్నీ వేడెక్కుతాయి.

వేసవిలో టీవీ, కంప్యూటర్‌, ఫ్రిజ్‌, వాషింగ్‌మెషిన్‌, వ్యాక్యూమ్‌ క్లీనర్‌, హీటర్ల వినియోగాన్ని వీలున్న మేరకు పరిమితం చేసుకోవాలి. లేకుంటే వాటిని వాడుతున్నంతసేపూ వేడి వెలువడుతూనే ఉంటుంది. దీంతో ఇంట్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది.

ఇంట్లో ఎక్కువ వేడి ఉత్పత్తి అయ్యేది వంట గదిలోనే. వంట గదిలోని వేడి బయటికి వెళ్లిపోయేలా వెంటిలేటర్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఈ వెంటిలేటర్ల కు ఎగ్జాస్టింగ్‌ ఫ్యాన్లు అమర్చుకోవాలి.

ఒక -ట్రేలో ఐస్‌ ముక్కలు వేసి, ఫ్యాన్‌ కింద పెడితే గదిలో చల్లదనం పరచుకుంటుంది. లేదా టబ్బులో చల్లని నీరుపోసి, గది మూలల్లో పెట్టినా గది చల్లబడుతుంది.

ఇంటి గోడల పక్కన పెద్ద పెద్ద రాళ్లు , సిమెంట్‌ నిర్మాణాల వంటివి అనవసరంగా ఉంటే వాటిని తొలగించాలి. ఎందుకంటే అవి ఎండను రిఫ్లెక్ట్ చేసి, వేడిని పెంచుతాయి.

First Published:  8 March 2021 2:37 AM GMT
Next Story