Telugu Global
National

రైతు చట్టాలు.. అసెంబ్లీ ఎన్నికలు..

దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న రైతుల ఆందోళనలో మరింత కదలిక వచ్చింది. రైతు దీక్ష 100రోజులు దాటడంతో సరికొత్త కార్యాచరణకు సిద్ధమవుతున్నారు అన్నదాతలు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ టిక్రీ సరిహద్దుల్లో రజ్బీర్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడటంతో మరింత కలకలం రేగింది. వ్యవసాయ చట్టాల రద్దు చేసి తన చివరి కోర్కె తీర్చాలంటూ కేంద్రానికి ఓ లేఖ రాసి […]

రైతు చట్టాలు.. అసెంబ్లీ ఎన్నికలు..
X

దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న రైతుల ఆందోళనలో మరింత కదలిక వచ్చింది. రైతు దీక్ష 100రోజులు దాటడంతో సరికొత్త కార్యాచరణకు సిద్ధమవుతున్నారు అన్నదాతలు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ టిక్రీ సరిహద్దుల్లో రజ్బీర్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడటంతో మరింత కలకలం రేగింది. వ్యవసాయ చట్టాల రద్దు చేసి తన చివరి కోర్కె తీర్చాలంటూ కేంద్రానికి ఓ లేఖ రాసి అది జేబులో పెట్టుకుని చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు రజ్బీర్. గతంలో హరియాణా, పంజాబ్ కి చెందిన రైతులు, సిక్కు మతగురువు రామ్ సింగ్ కూడా ఇలానే బలవనర్మరణాలకు పాల్పడ్డారు. రిపబ్లిక్ డే ఘటన తర్వాత, చట్టాల రద్దుకోసం జరిగిన తొలి ఆత్మార్పణం ఇదే.

అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం ఎంత..?
ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తుందని చెప్పలేం కానీ.. రైతు చట్టాలపై కేంద్రం మొండి పట్టుదల, ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఆందోళనలు, దేశవ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహానికి కారణంగా మారుతున్నాయి. అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో.. స్థానిక సమస్యలే ప్రధానాంశాలయ్యే అవకాశం ఉంది. కానీ, పశ్చిమబెంగాల్ లో మాత్రం రైతు ఉద్యమ ప్రభావం కచ్చితంగా కనిపిస్తుందని అంటున్నారు. దీంతో కేంద్రం కూడా ఇరకాటంలో పడింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలయ్యే నాటికి వ్యవసాయ చట్టాల వ్యవహారానికి ముగింపు పలకాలనే ఉద్దేశంలో ఉంది.

వ్యవసాయ మంత్రి తాజా ప్రకటన..
నూతన వ్యవసాయ చట్టాలకు సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ మరోసారి స్పష్టంచేశారు. సాగు చట్టాలపై ఉన్న అభ్యంతరాలను తెలియజేయాలని అడుగుతున్నా.. రైతు సంఘం నేతలు స్పందించడం లేదని.. రద్దు రద్దు అంటూ మొండి పట్టుదలకు పోతున్నారని అన్నారాయన. కేవలం రైతుల నిరసనలను విపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. వ్యవసాయ చట్టాలకు సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అంటే దానర్థం.. చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయని కాదని స్పష్టం చేశారు. సాగుచట్టాలపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే పార్లమెంట్‌లో స్పష్టం చేశామని చెప్పారు. అదే సమయంలో రైతుల సంక్షేమం కోసమే నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా అన్నారు. 11 దఫాలు చర్చలు జరిపి తాము రైతుల సంక్షేమం కోసమే ఎదురు చూస్తున్నామని అన్నారు. మరో దఫా చర్చలకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఏడాదిన్నరపాటు సాగు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తామన్న ప్రతిపాదన సైతం రైతులు పరిగణలోకి తీసుకోవడంలేదని అన్నారు. విపక్షాలు రాజకీయాలు ఆపాలని చెప్పారు. మొత్తమ్మీద రైతు ఉద్యమం 11 దఫాల చర్చల అనంతరం సందిగ్ధంలో పడింది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడానికి రైతు సంఘాలున్నీ సమాయత్తమవుతున్నాయి.

First Published:  7 March 2021 8:33 PM GMT
Next Story