Telugu Global
National

20 సీట్లు ఇచ్చిన అన్నాడీఎంకే.. సరిపోవంటున్న బీజేపీ

తమిళనాడు అసెంబ్లీకి త్వరలో జరుగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కలసి పోటీ చేయనున్నాయి. ఈ మూడు పార్టీలు సీట్ల పంపిణీ విషయంలో చెన్నైలో భేటీ అయ్యాయి. సీఎం ఎడిప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, బీజేపీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి సీటీ రవి, అధ్యక్షుడు మురుగన్ ఏయే సీట్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చ జరిపారు. కాగా, మొత్తం 234 సీట్లలో 20 సీట్లు బీజేపీకి, 23 సీట్లు పీఎంకేకి కేటాయించారు. ఇక అన్నాడీఎంకేకు […]

20 సీట్లు ఇచ్చిన అన్నాడీఎంకే.. సరిపోవంటున్న బీజేపీ
X

తమిళనాడు అసెంబ్లీకి త్వరలో జరుగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కలసి పోటీ చేయనున్నాయి. ఈ మూడు పార్టీలు సీట్ల పంపిణీ విషయంలో చెన్నైలో భేటీ అయ్యాయి. సీఎం ఎడిప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, బీజేపీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి సీటీ రవి, అధ్యక్షుడు మురుగన్ ఏయే సీట్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చ జరిపారు.

కాగా, మొత్తం 234 సీట్లలో 20 సీట్లు బీజేపీకి, 23 సీట్లు పీఎంకేకి కేటాయించారు. ఇక అన్నాడీఎంకేకు దక్కిన 161 సీట్లలో కొన్నింటిని విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు కేటాయించే అవకాశం ఉన్నది. అయితే తమకు 20 సీట్లే కేటాయించడంపై బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి కేవలం 20 సీట్లు కేటాయించడం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.

అయితే తమిళనాడులో బీజేపీకి అంత బలం లేదని.. ఇప్పుడు ఇచ్చిన 20 సీట్లు కూడా చాలా ఎక్కువేనని కొందరు అన్నాడీఎంకే నేతలు అంటున్నారు. తాజగా అన్నా డీఎంకే తమ తొలి విడత అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించింది. ఇందులో ఎడప్పాడి నుంచి పళనిస్వామి, బోడినాయకనూర్ నుంచి పనీర్ సెల్వం, మంత్రి జయకుమార్ రాయపురం, మంత్రి సీవీ షణ్ముగం విల్లుపురం నుంచి పోటీ చేయనున్నారు.

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి మొత్తం 39 స్థానాలకు పోటీ చేసి 38 స్థానాల్లో ఓడిపోయింది. బీజేపీ ఐదింటిలో పోటీ చేసి ఒక్క చోట కూడా నెగ్గలేదు. కాగా, అసెంబ్లీ ఎన్నికలతో పాటే ప్రస్తుతం కన్యాకుమారి లోక్‌సభకు ఉపఎన్నికను కూడా నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్నది. బీజేపీ నుంచి పొన్ రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనుండగా.. మే 2న ఫలితాలు వెలుడడనున్నాయి.

First Published:  6 March 2021 6:24 AM GMT
Next Story