Telugu Global
NEWS

ఉత్తరాంధ్ర ద్రోహుల్ని విశాఖ నుంచి తరిమి కొడతాం..

ఏబీసీడీ అంటూ వైసీపీకి కొత్త నిర్వచనం ఇచ్చి సీఎం జగన్ పై విమర్శలు చేసిన చంద్రబాబుకి గట్టి కౌంటర్ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఆల్ ల్ బేవర్స్, చీటర్స్ అండ్ డెకాయిట్స్ పార్టీ.. టీడీపీ అని విమర్శించారు. విశాఖ భూముల్ని చంద్రబాబు గద్దలకు కట్టబెడితే.. తమ ప్రభుత్వం పేదలకు పంచిపెడుతోందని చెప్పారాయన. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్ కి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని, అటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా తమ పార్టీ […]

ఉత్తరాంధ్ర ద్రోహుల్ని విశాఖ నుంచి తరిమి కొడతాం..
X

ఏబీసీడీ అంటూ వైసీపీకి కొత్త నిర్వచనం ఇచ్చి సీఎం జగన్ పై విమర్శలు చేసిన చంద్రబాబుకి గట్టి కౌంటర్ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఆల్ ల్ బేవర్స్, చీటర్స్ అండ్ డెకాయిట్స్ పార్టీ.. టీడీపీ అని విమర్శించారు. విశాఖ భూముల్ని చంద్రబాబు గద్దలకు కట్టబెడితే.. తమ ప్రభుత్వం పేదలకు పంచిపెడుతోందని చెప్పారాయన. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్ కి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని, అటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఒక్క విశాఖలోనే 1.9 లక్షల ఇళ్ళను ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిందని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు మేలు చేసే నాయకుడు జగన్ అని అన్నారు. కొంతమందికే మంచి చేసే వ్యక్తి చంద్రబాబు అని అందుకే బాబుని ముఠా నాయకుడు అంటారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అనకాపల్లి పరిధిలోని భూముల్ని టీడీపీ ప్రభుత్వం 22ఏ సెక్షన్ కింద చేర్చి కొనుగోలు, అమ్మకాలు జరక్కుండా అన్యాయం చేసిందని, నిబంధనలు సవరించి అనకాపల్లివాసులకు వైసీపీ ప్రభుత్వం విముక్తి కల్పించిందని అన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు విజయసాయి. చంద్రబాబు సినిమాకు స్థానిక సంస్థల ఎన్నికలతో ప్రజలు ముగింపు పలకబోతున్నారని, పురపాలక ఎన్నికలతో టీడీపీ కథ ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు వచ్చి తీరుతుందని చెప్పారు. కాస్త ఆలస్యం అయినా మూడు రాజధానులు ఏర్పడి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉత్తరాంద్ర ద్రోహులను విశాఖలో అడుగు పెట్టనివ్వొద్దని ప్రజలు పిలుపునిచ్చారు. చంద్రబాబు దేహంలోని అణువణువూ నెగెటివ్ నెస్ తో నిండిపోయిందని, అవే లక్షణాలు లోకేష్ కి కూడా వచ్చాయని ఎద్దేవా చేశారు. సింహం కడుపున సింహంలా జగన్ పుట్టారని, నక్క కపుడున నక్కలాగా.. జిత్తులమారి లక్షణాలతో లోకేష్ పుట్టారని, కాకి కడుపున పుట్టిన కాకిలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖను కబ్జాలు లేని నగరంగా, ప్రజలు చాలా సంతోషంగా జీవించే నగరంగా అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా అడ్డుకోలేరు..
విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని కాకుండా చంద్రబాబు అడ్డుకోలేరని అన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. విజయసాయిరెడ్డితో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా కేంద్రాన్ని ఒప్పించిన తర్వాతే, బీజేపీ-జనసేన కూటమి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వలేదని, ఏ మొహం పెట్టుకుని బీజేపీ-జనసేన కూటమి ఓట్లకోసం జనంలోకి వస్తుందని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుపై కేంద్రాన్ని అడిగే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదని, మోదీ పేరు చెపితే గజగజ వణికిపోతారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమా లేక వైసీపీ ప్రభుత్వమా అనేది కూడా లోకేష్ కి తెలియదని అన్నారు. విశాఖ ఉక్కు కార్మిక సంఘాలకు తాము పూర్తిగా మద్దతిస్తున్నామని, కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలతో పోటీ పడుతుందని, అంతర్జాతీయ నగరంగా ఖ్యాతికెక్కుతుందని చెప్పారు.

ఆ భాషేంటి బాబూ..
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసి ఏం పీకుతారంటూ చంద్రబాబు, లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, పశువులు కాసుకునేవారు సైతం మర్యాదగా మాట్లాడతారని, కనీసం ఆ పాటి జ్ఞానం కూడా తండ్రీ కొడుకులకు లేదని విమర్శించారు మరో మంత్రి కన్నబాబు. విశాఖలో ఏం పీకుతారనే విషయం పక్కనపెడితే 2019 ఎన్నికల్లో టీడీపీనుంచి జనం ఏం పీకేశారనే విషయం ముందు బాబు తెలుసుకోవాలని, రీసెంట్ గా కుప్పంలో ఏం పీకేశారో కూడా గమనించాలని సెటైర్లు వేశారు. టీడీపీ హయాంలో విశాఖకు ఏంచేశారని ప్రశ్నించారు. కేవలం అంతర్జాతీయ సమ్మిట్ల పేరుతో స్టార్ హోటళల్లో కూర్చుని మేత మేశారని విమర్శించారు. భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి కారిడార్ వరకూ, శాశ్వతంగా అభివృద్ధి జరిగేలా కార్యక్రమాలు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. విశాఖ ప్రజల్ని ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని చెప్పారు. రాష్ట్రంలో ఆస్తి పన్ను పెంచలేదని, కేవలం సహేతుకంగా ఉండేలా మార్పులు చేశామని వివరణ ఇచ్చారు కన్నబాబు. గత 18 నెలల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా పన్ను అదనంగా విధించలేదని చెప్పారు. అభివృద్ధికి అడ్డుపడుతోంది టీడీపీయేనని అన్నారు. పేదలకు 32 లక్షల ఇళ్ళ పట్టాలు, ఇళ్ళు ఇస్తే.. కోర్టులకు వెళ్ళి అడ్డుకోవాలని చూసింది చంద్రబాబేనని అన్నారు. వైసీపీ షట్టర్లు తెరిస్తే చంద్రబాబు, లోకేష్ మినహా ఆ పార్టీలో ఎవరూ మిగలరని అన్నారు. కుప్పం దెబ్బతో బాబుకి మైండ్ బ్లాంక్‌ అయిందని, ఆయన ఆ షాక్ నుంచి ఇప్పట్లో తేరుకోలేరని అన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో ఏం పీకుతారు అన్న చంద్రబాబు ముందు విశాఖ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

First Published:  5 March 2021 9:19 PM GMT
Next Story