Telugu Global
Cinema & Entertainment

ఏ1 ఎక్స్ ప్రెస్ మొదటి రోజు వసూళ్లు

ఈ వీకెండ్ 10 సినిమాలు రిలీజయ్యాయి. అయితే వేటికీ వసూళ్లు లేవు. వీటిలో దాదాపు 9 సినిమాల మార్నింగ్ షోలు ప్రేక్షకుల్లేక రద్దయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉన్నంతలో సందీప్ కిషన్ హీరోగా నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ కు మాత్రమే వసూళ్లు వచ్చాయి. అవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కాదు. ఏ1 ఎక్స్ ప్రెస్ కు మొదటి రోజు వరల్డ్ వైడ్ కోటిన్నర షేర్ వచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ షేర్ తో ఇది […]

ఏ1 ఎక్స్ ప్రెస్ మొదటి రోజు వసూళ్లు
X

ఈ వీకెండ్ 10 సినిమాలు రిలీజయ్యాయి. అయితే వేటికీ వసూళ్లు లేవు. వీటిలో దాదాపు 9 సినిమాల
మార్నింగ్ షోలు ప్రేక్షకుల్లేక రద్దయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉన్నంతలో సందీప్ కిషన్
హీరోగా నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ కు మాత్రమే వసూళ్లు వచ్చాయి. అవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కాదు.

ఏ1 ఎక్స్ ప్రెస్ కు మొదటి రోజు వరల్డ్ వైడ్ కోటిన్నర షేర్ వచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు. అయితే
ఈ షేర్ తో ఇది బ్రేక్ ఈవెన్ అవుతుందనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే, ఈ సినిమాను 6 కోట్ల
రూపాయలకు అమ్మారు. మొదటి రోజు రెండున్న కోట్లు ఆశించారు. కానీ కోటిన్నర మాత్రమే వచ్చింది. ఈ
నేపథ్యంలో.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా అనే అనుమానం అందర్లో ఉంది.

ఈ సినిమాకు ఏపీ,నైజాంలో మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 24 లక్షలు
సీడెడ్ – 8 లక్షలు
ఉత్తరాంధ్ర – 10 లక్షలు
ఈస్ట్ – 8 లక్షలు
వెస్ట్ – 6 లక్షలు
గుంటూరు – 7 లక్షలు
కృష్ణా – 7 లక్షలు
నెల్లూరు – 6 లక్షలు

First Published:  6 March 2021 5:30 AM GMT
Next Story