Telugu Global
Cinema & Entertainment

రేపు ఏ సినిమా క్లిక్ అవుతుందో?

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 10 సినిమాలు రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. ఆల్రెడీ థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. నాంది, ఉప్పెన లాంటి సినిమాల రన్ దాదాపు పూర్తయింది. చెక్ సినిమా ఆల్రెడీ ఫ్లాప్ అయింది. ఈ నేపథ్యంలో రేపు థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. రేపు సందీప్ కిషన్ నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా వస్తోంది. తెలుగులో వస్తున్న తొలి హాకీ మూవీ ఇదే. లావణ్య త్రిపాఠి హీరోయిన్ […]

రేపు ఏ సినిమా క్లిక్ అవుతుందో?
X

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 10 సినిమాలు రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. ఆల్రెడీ థియేటర్లు
ఖాళీగా ఉన్నాయి. నాంది, ఉప్పెన లాంటి సినిమాల రన్ దాదాపు పూర్తయింది. చెక్ సినిమా ఆల్రెడీ ఫ్లాప్
అయింది. ఈ నేపథ్యంలో రేపు థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందనేది ఆసక్తికరంగా
మారింది.

రేపు సందీప్ కిషన్ నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా వస్తోంది. తెలుగులో వస్తున్న తొలి హాకీ మూవీ ఇదే.
లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. దీంతో పాటు రాజ్
తరుణ్ హీరోగా నటించిన పవర్ ప్లే అనే సినిమా కూడా రేపే థియేటర్లలోకి వస్తుంది. అటు దిల్ రాజు
తెరకెక్కించిన షాదీ ముబారక్ అనే ఓ చిన్న సినిమా కూడా వస్తోంది.

వస్తున్న 10 సినిమాల్లో.. పైన చెప్పుకున్న 3 మూవీస్ మాత్రమే ప్రేక్షకుల్ని అంతోఇంతో ఎట్రాక్ట్
చేస్తున్నాయి. మిగతా సినిమాలపై ఎవ్వరికీ పెద్దగా అంచనాల్లేవు. వీటిలో మూవీ-A, క్లైమాక్స్,
పరమానందయ్య శిష్యుల కథ, గజకేసరి, విక్రమార్కుడు లాంటి సినిమాలున్నాయి.

First Published:  4 March 2021 7:56 AM GMT
Next Story