Telugu Global
NEWS

బీజేపీకి చెలగాటం.. టీఆర్ఎస్ కి ప్రాణ సంకటం..

తెలంగాణలో జరగబోతున్న పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ కి ప్రాణసంకటంలా మారాయి. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి సిట్టింగ్ అభ్యర్థి బరిలో దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పరువు నిలుపుతారని అంచనా ఉన్నా.. నెగెటివ్ సెంటిమెంట్ ఉన్న రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి విజయం అనుమానంగానే ఉంది. అయితే రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు మాత్రం అర్థమవుతోంది. ఇటీవల దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు తేడా కొట్టడంతో ఈసారి మరింత పగడ్బందీగా […]

బీజేపీకి చెలగాటం.. టీఆర్ఎస్ కి ప్రాణ సంకటం..
X

తెలంగాణలో జరగబోతున్న పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ కి ప్రాణసంకటంలా మారాయి. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి సిట్టింగ్ అభ్యర్థి బరిలో దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పరువు నిలుపుతారని అంచనా ఉన్నా.. నెగెటివ్ సెంటిమెంట్ ఉన్న రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి విజయం అనుమానంగానే ఉంది. అయితే రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు మాత్రం అర్థమవుతోంది. ఇటీవల దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు తేడా కొట్టడంతో ఈసారి మరింత పగడ్బందీగా ఎన్నికలకోసం సన్నాహాలు చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఈ భారాన్నంతా భుజాన మోస్తున్నారు. అటు బీజేపీ, కాంగ్రెస్ సహా.. స్వతంత్ర అభ్యర్థులతో గట్టి పోటీ ఉండటంతో కేటీఆర్ వివిధ రంగాలకు చెందినవారితో వేర్వేరుగా సభలు, సమావేశాలు పెడుతూ ప్రచార పర్వాన్ని ముందుండి నడిపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ బోణీ కొట్టలేని రంగారెడ్డి సీటు పోయినా పర్వాలేదు, కనీసం సిట్టింగ్ సీటు నల్గొండ అయినా గెలుచుకోవాలనే తాపత్రయం కేటీఆర్ లో కనపడుతోంది. ఒకవేళ ఈ రెండు సీట్లలో ఏ ఒక్కచోట బీజేపీ గెలిచినా, లేదా రెండు చోట్ల అధికార టీఆర్ఎస్ ఓడిపోయినా అది మరింత పెద్ద అవమానంగా భావించాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ సూచనలతో నేరుగా కేటీఆర్ రంగంలోకి దిగి వ్యవహారం చక్కబెడుతున్నారు.

బీజేపీకి చెలగాటం..
వాస్తవానికి ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీకి పెద్దగా స్కోప్ లేదు. కానీ దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహం మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లో కనపడుతోంది. అటు బండి సంజయ్ దూకుడు, విద్యావంతుల్లో ప్రధాని మోదీకి ఉన్న పలుకుబడితో ఈ ఎన్నికలను నెట్టుకొస్తామని ఆశిస్తున్నారు బీజేపీ నాయకులు. రంగారెడ్డి నుంచి రాంచందర్‌ రావు, నల్లగొండ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డిలు ప్రచారం జోరు పెంచారు. ఇటీవల జీహెచ్ఎంసీలో పెరిగిన ఓటు బ్యాంకు.. రంగారెడ్డి స్థానం విషయంలో తమకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు బీజేపీ నేతలు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ కి పట్టు ఉన్నా కూడా ప్రస్తుతం ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమేనని తెలుస్తోంది. రంగారెడ్డిలో ఈ దఫా కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కే పట్టభద్రులు పట్టం కట్టే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ బలం పెంచుకోడానికి బీజేపీ, పరువు నిలుపుకోడానికి టీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

First Published:  3 March 2021 12:34 AM GMT
Next Story