ప్రగతి భవన్ ప్రక్షాళన ! కీలక వికెట్లపైనే గురి !
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమితో గులాబీ బాస్ తేరుకున్నారు. తన చుట్టూ చేరిన కోటరీతో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని గ్రహించారో తెలియదు. లేక వారసుడిగా కేటీఆర్‌కు రాచబాట వేస్తున్నా రో తెలియదు. కానీ ప్రగతి భవన్‌లో ప్రక్షాళన మొదలైంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ వెంట ఉన్న పీఆర్వో గటిక విజయకుమార్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పీఆర్వో పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. కానీ రాజకీయ కారణాలతోనే రాజీనామా చేసినట్లు తెలిసింది. ఒక్క విజయకుమార్‌తోనే ఈ […]

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమితో గులాబీ బాస్ తేరుకున్నారు. తన చుట్టూ చేరిన కోటరీతో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని గ్రహించారో తెలియదు. లేక వారసుడిగా కేటీఆర్‌కు రాచబాట వేస్తున్నా రో తెలియదు. కానీ ప్రగతి భవన్‌లో ప్రక్షాళన మొదలైంది.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ వెంట ఉన్న పీఆర్వో గటిక విజయకుమార్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పీఆర్వో పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. కానీ రాజకీయ కారణాలతోనే రాజీనామా చేసినట్లు తెలిసింది.
ఒక్క విజయకుమార్‌తోనే ఈ ప్రక్షాళన ఆగదని తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో 20 మందిని కూడా సాగనంపుతారని సమాచారం. అయితే విజయ్ కుమార్ తొలగింపునకు అవినీతి ఆరోపణలే కారణమని తెలుస్తోంది. తన కులానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తన బంధువులకు ఉద్యోగాలు పెట్టించారని తెలుస్తోంది. ఇదే కాదు చాలా మంది దగ్గరడబ్బులు వసూలు చేశారని సమాచారం. అవినీతి ఆరోపణలు తీవ్రం కావడంతో చివరకు పదవి నుంచి ప్రభుత్వ పెద్దలు తొలగించారని తెలుస్తోంది.
ఓ మైనింగ్ కంపెనీ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని ప్రగతి భవన్‌కు ఫిర్యాదు వెళ్లింది. దీంతో పాటు టీఆర్‌ఎస్‌లో ఓ కీలక నేతతో విజయ్‌కుమార్‌కు దగ్గర సంబంధాలు ఉన్నాయట. ఈ విషయం తెలిసిన కేటీఆర్ టీమ్ ఆయన పక్కన పెట్టారని మరో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అవినీతి ఆరోపణలే విజయ్ కుమార్ తొలగింపు కారణమని ప్రధానంగా తెలుస్తోంది.