Telugu Global
Cinema & Entertainment

ఆదిపురుష్‌లో సీతగా కీర్తి?

పాన్ ఇండియా స్టార్‌.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా రామాయణం నేపథ్యంలో పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతుండడంతో ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇందులో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. సీత, హనుమంతుడు క్యారెక్టర్లలో ఎవరు కనిపిస్తారు అనే విషయంపై అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ వెంట సీతగా అనుష్క శెట్టి, కృతి సనన్ పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ‘మహానటి’ కీర్తి సురేష్ […]

ఆదిపురుష్‌లో సీతగా కీర్తి?
X

పాన్ ఇండియా స్టార్‌.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా రామాయణం నేపథ్యంలో పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతుండడంతో ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇందులో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. సీత, హనుమంతుడు క్యారెక్టర్లలో ఎవరు కనిపిస్తారు అనే విషయంపై అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ వెంట సీతగా అనుష్క శెట్టి, కృతి సనన్ పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ‘మహానటి’ కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే చిత్ర బృందం ఆమెతో చర్చలు జరిపిందని, త్వరలో అధికారక ప్రకటన రానుందని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇక హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ యువ నటుడు సన్నీ సింగ్‌ని ఎంపిక చేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం ‘ఆదిపురుష్’ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తుంది.

First Published:  3 March 2021 1:02 AM GMT
Next Story