Telugu Global
Health & Life Style

బెల్లీ ఫ్యాట్ పెంచే.. ఏడు చెడు అలవాట్లు

పదిమందిలో దాదాపు ఎనిమిది మంది ఎదుర్కుంటోన్న సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ ఒకటి. నడుము చుట్టు పేరుకుపోయిన అనవసరమైన కొవ్వునే బెల్లీ ఫ్యాట్ అంటారు. దీన్ని అద్దంలో చూసుకోని బాధపడని వాళ్లే ఉండరు! వ్యాయామాలు చేసినా తగ్గదు. యోగా చేసినా పోదు. ఇక, తినకుండా పస్తులున్నా ఆ పరిస్థితి కొంచెం మారదు. వయసుతో పాటు పెరుగుతూ అందరినీ ఇబ్బంది పెడుతున్న ఈ బెల్లీ ఫ్యాట్ కి అసలు కారణం ఏంటో తెలుసా? మన అలవాట్లే! అవును మీరు చదివింది […]

బెల్లీ ఫ్యాట్ పెంచే.. ఏడు చెడు అలవాట్లు
X

పదిమందిలో దాదాపు ఎనిమిది మంది ఎదుర్కుంటోన్న సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ ఒకటి. నడుము చుట్టు పేరుకుపోయిన అనవసరమైన కొవ్వునే బెల్లీ ఫ్యాట్ అంటారు. దీన్ని అద్దంలో చూసుకోని బాధపడని వాళ్లే ఉండరు! వ్యాయామాలు చేసినా తగ్గదు. యోగా చేసినా పోదు. ఇక, తినకుండా పస్తులున్నా ఆ పరిస్థితి కొంచెం మారదు. వయసుతో పాటు పెరుగుతూ అందరినీ ఇబ్బంది పెడుతున్న ఈ బెల్లీ ఫ్యాట్ కి అసలు కారణం ఏంటో తెలుసా? మన అలవాట్లే! అవును మీరు చదివింది నిజమే.. ఎందుకంటే కొన్ని రకాల చెడు అలవాట్ల వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుందని స్టడీస్ చెప్తున్నాయి. ఈ అలవాట్లు మానుకుంటే తప్పా.. ఈ బెల్ ఫ్యాట్ పని పట్టలేమన్నమాట!!

1. సోడాలు తాగడం

డైట్ అనే ట్యాగ్ మనల్నిపక్కదారి పట్టిస్తుంది. అదేలా అంటే..

డైట్ సోడాస్ అంటే కొకాకోలా, పెప్సీ లాంటివి.. నో షుగర్, జీరో క్యాలరీస్ అని ప్రమోషన్ తో మార్కెట్ లోకి వస్తాయి. ఇక, ఇవి మంచివేనని మనసు నమ్మి అడ్డు అదుపు లేకుండా తాగడానికి పర్మిషన్ ఇస్తుంది. డైట్ సోడా తాగటం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరిగుతుందని ‘యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్’ చేసిన స్టడీలో బయటపడింది. వీటిలో వాడే ఆర్టిఫిషియల్ చెక్కర.. బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ని పెంచుతుంది. శరీరంలో చేరిన ఈ ఎక్స్ ట్రా గ్లూకోజ్ అంతా నడుము చుట్టు కొవ్వులాగా పేరుకుపోతుందని ఈ స్టడీ చెప్పింది.

2. నలుగురితో కలిసి తినడం

రెస్టారెంట్ కి ఒక్కరం వెళ్లి తింటేనే.. సాధారణంగానే ఎక్కువ తింటాం. ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తే… ఇంకా ఎక్కువ తింటాం. రెగ్యులర్ గా ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లి తినేవాళ్లలో, పార్టీలు చేసుకునే వాళ్లలో బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. న్యూట్రిషియల్ జర్నల్ లో పబ్లిష్ చేసిన వివరాల ప్రకారం.. మనం ఒక వ్యక్తితో కలిసి తింటే.. మనం తినేదాని కంటే 33 శాతం ఎక్కువ తింటాం. అదే ఇద్దరి తో కలిసి తింటే 47 శాతం ఎక్కువ తింటాం. అంటే ముచ్చట్లో మునిగి ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అనే విషయాలు మర్చిపోతాం అని ఈ స్టడీ వివరించింది.

3. సోషల్ మీడియలో గడపడం

‘ఇది నమ్మండి.. నమ్మకపోండి.. మీరు సోషల్ మీడియాను విపరీతంగా ప్రేమిస్తున్నారు అంటే.. అది మీకు బెల్లీ ఫ్యాట్ ని రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తుంది’అని ఒకటి కాదు రెండు కాదు ఆక్స్ ఫర్డ్ నుంచి కాలిఫోర్నియా యూనివర్సిటీ వరకూ అన్ని స్టడీలూ చెప్తున్నాయి. అదేలా అంటారా? ముందుగా పడుకునేటప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు చూడటం మొదలుపెడతారు. అవి ఎంతకూ ఒడవవు. అలా నిద్ర చెడిపోతుంది. దాంతో మెదడులో ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ అనే నిద్ర తాలూకు హార్మోన్ ని అణచివేతకు, ఒత్తిడికి గురవుతుంది. తర్వాత సరైన నిద్ర పోలేరు. కాబట్టి, జీవక్రియ దెబ్బతింటుంది. దాంతో రాత్రిపూటే ఏదైనా తినాలనిపిస్తుంది. ఇంకేముంది బెల్లి ఫ్యాట్ కి ఇలా వెల్ కమ్ చెప్పినట్టే! అదే సోషల్ మీడియాను పిచ్చిగా వాడకుంటే.. చక్కగా తిని టైంకి నిద్రపోతారు. కాబట్టి, వేళాపాళ లేని తిండికి బ్రేక్ పడుతుంది. హాయిగా, ఆరోగ్యంగా ఉంటారు.

4. వేగంగా తినడం

వేగంగా ఎదగాలి, వేగంగా సాధించాలనే కసి మంచిదే. కానీ, టైం వేస్ట్ కాకుండా ఉండాలని వేగంగా తింటే మాత్రం కచ్చితంగా మంచిది కాదు. ఈ విషయం ‘అమెరికా డైటెటిక్ అసోసియేషన్’ తన జర్నల్ లో ప్రచురించింది. వేగంగా తినేవాళ్లతో పోలిస్తే.. నెమ్మదిగా తినేవాళ్లు భోజనం చేసినప్పుడల్లా 66 క్యాలరీలు తక్కువగా తీసుకుంటారని చెప్పింది. ఇక రోజుకు మూడుసార్లు తింటారు కాబట్టి, వేగంగా తినేవాళ్లు తీసుకోవాల్సిన దానికంటే దాదాపు రెండొందల క్యాలరీలు అధికంగా తీసుకుంటారు.

5. పెద్ద ప్లేట్లలో తింటే కూడా

అవును పెద్ద ప్లేట్లతో తింటే కూడా తినాల్సిన దానికంటే అధికంగా తింటామని ‘కార్నెల్ యూనివర్సిటీ’ వాళ్లు చేసిన స్టడీలో తేలింది. దీని వల్ల బరువు పెరగడం, బెల్లీ ఫ్యాట్ పెరిగిపోవడం ఒక క్రమ పద్ధతిలో జరిగిపోతుంది. దీంతో పాటు చాలామంది పచ్చళ్లు, ఇంకా రకరకాల ఆహార పదర్థాల్ని ఫ్యాన్సీ గాజు పాత్రల్లో నిల్వ చేస్తుంటారు. ఇవి చూడటానికి టెంప్టింగ్ గా ఉంటాయి. కాబట్టి, ఆకలిగా లేకున్నా.. అతిగా తింటారని గూగుల్ చేపట్టిన ఒక స్టడీలో బయటపడింది. ముఖ్యంగా జంక్ ఫుడ్ ఫ్యాన్సీ గ్లాస్ పాత్రల్లో నిల్వ చేయకపోవడం చాలా మంచిదని ఈ స్టడీ సూచించింది.

6. డిన్నర్ టైం

సాధారణంగా అయితే, మన పూర్వీకులు సూర్యాస్తమయం కాకముందే డిన్నర్ పూర్తి చేసేవారు. ఇప్పుడు మారిన జీవన శైలిలో చాలామంది ఇష్టమొచ్చిన టైంకి తింటున్నారు. అయితే, రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల లోపు డిన్నర్ పూర్తి చేయాలి. ఎందుకంటే లేట్ గా డిన్నర్ చేసేవాళ్లలో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుందని ‘ఒబెసిటీ సొసైటీ జర్నల్’ లో పబ్లిష్ అయిన ఒక స్టడీ సారాంశం. నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాలని, లేదంటే ఆ క్యాలరీలు ఖర్చు కావు కాబట్టి, బెల్లీ ఫ్యాట్ గా మారిపోతుందని ఈ స్టడీ హెచ్చరించింది.

7. వెచ్చగా హాయిగా నిద్రపోతే..

వెచ్చగా, హాయిగా బెడ్రూం ఉంటే శరీరం నిద్రలేవడానికి ఇష్టపడదు. దాంతో సోమరితనం పెరగిపోతుంది. వెచ్చని గది శరీరానికి కంఫర్ట్ ని స్తుంది. ఈ కంఫర్ట్ బెల్లీని తీసుకొస్తుందని ‘సెల్ ప్రెస్ జర్నల్’ లో ప్రచురించిన స్టడీ చెప్తోంది. వెచ్చగా, హాయిగా ఉంటే పొద్దున్నే లేసి వ్యాయామం చేయబుద్ధికాదని, సో బెడ్రూం చల్లగా ఉంచుకోవాలని, కంఫర్ట్స్ ని తీసేయాలని ఈ స్టడీ సూచించింది.

ఫైనల్ గా చెప్పేది ఏంటంటే.. కేవలం డైట్స్, వ్యాయమాలతో బెల్లీ ఫ్యాట్ రాకుండా అడ్డుకోలేం. కాబట్టి, వెంటనే ఈ ఏడు చెడు అలవాట్లకు దూరంగా జరగాలి. అప్పుడే.. మన ఫిట్ నెస్ గోల్స్ ని అందుకుంటాం. ఆరోగ్యంగా బతుకుతాం!!

Next Story