అనసూయ అలా సమర్థించుకుంది
ఏదైనా సమర్థించుకోవాల్సి వస్తే సినిమా జనాలు తీసినన్ని లాజిక్స్ మరెవ్వరూ తీయలేదు. మొన్నటికి మొన్న ఓ సినిమా డిజాస్టర్ అయితే, ఆ మూవీ నిర్మాత మాట్లాడుతూ.. చూసిన 10 మంది తమ సినిమా బ్లాక్ బస్టర్ అన్నారంటూ సర్థించుకున్నాడు. అది వితండవాదం అనే విషయం అందరికీ తెలుస్తున్నప్పటికీ అతడి వెర్షన్ అతడిదే. ఇప్పుడు అనసూయ కూడా తను చేసిన ఓ పనిని ఇలానే సమర్థించుకుంటోంది. చావు కబురు చల్లగా అనే సినిమాలో ఐటెంసాంగ్ చేసింది అనసూయ. అయితే ఇదే అనసూయ […]
ఏదైనా సమర్థించుకోవాల్సి వస్తే సినిమా జనాలు తీసినన్ని లాజిక్స్ మరెవ్వరూ తీయలేదు. మొన్నటికి
మొన్న ఓ సినిమా డిజాస్టర్ అయితే, ఆ మూవీ నిర్మాత మాట్లాడుతూ.. చూసిన 10 మంది తమ సినిమా బ్లాక్ బస్టర్ అన్నారంటూ సర్థించుకున్నాడు. అది వితండవాదం అనే విషయం అందరికీ తెలుస్తున్నప్పటికీ అతడి వెర్షన్ అతడిదే. ఇప్పుడు అనసూయ కూడా తను చేసిన ఓ పనిని ఇలానే సమర్థించుకుంటోంది.
చావు కబురు చల్లగా అనే సినిమాలో ఐటెంసాంగ్ చేసింది అనసూయ. అయితే ఇదే అనసూయ గతంలో
ఐటెంసాంగ్స్ చేయనని ప్రకటించుకుంది. మరి ఇప్పుడేంటి ఇలా అనే ప్రశ్న ఎదురైంది. దీన్ని తనదైన
శైలిలో సమర్థించుకుంది అనసూయ. తను ఐటెంసాంగ్ చేయలేదని, స్పెషల్ సాంగ్ చేశానని
చెప్పుకొస్తోంది.
చావు కబురు చల్లగా సినిమాలో తను చేసిన పాటలోని సాహిత్యం వింటే ఎవరికైనా విషయం
అర్థమౌతుందని చెబుతోంది. కేవలం ఆ సాహిత్యం చూసి మాత్రమే తను ఈ సాంగ్ చేయడానికి
ఒప్పుకున్నానని తెలిపింది. ఒకప్పుడు అమ్మాయిని వస్తువుగా భావించేవాళ్లు ఐటెంసాంగ్ అనే
పేరుపెట్టారని.. కానీ ఇప్పటి సినిమాల్లో స్పెషల్ గా ఎవరైనా కావాలని భావించినప్పుడు స్పెషల్ సాంగ్
పెడుతున్నారని తనదైన స్టయిల్ లో వివరణ ఇచ్చింది.