Telugu Global
National

గల్లీ ఛాయ్ రూ.1000.. ఎక్కడంటే..

మనదేశంలో ఛాయ్ ఎంత స్పెషలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఛాయ్ రోడ్డు పక్కన అయితే ఓ పది లేదా ఇరవై రూపాయలుంటుంది. ఇదే ఛాయ్ ఫైవ్ స్టార్ హోటల్లో అయితే వంద నుంచి ఐదొందలు ఉండచ్చేమో.. కానీ కోల్‌కతాలోని ఓ రోడ్ సైడ్ టీ షాపులో కప్పు టీ అక్షరాలా వెయ్యి రూపాయలు. ఎందుకంటే.. కోల్‌కతాలోని ముకుందాపూర్ లో పార్థ ప్రతీం గంగూలీ అనే వ్యక్తి తన టీ స్టాల్‌లో టీ కప్పు ధర రూ.1000లు. ఎందుకంటే […]

గల్లీ ఛాయ్ రూ.1000.. ఎక్కడంటే..
X

మనదేశంలో ఛాయ్ ఎంత స్పెషలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఛాయ్ రోడ్డు పక్కన అయితే ఓ పది లేదా ఇరవై రూపాయలుంటుంది. ఇదే ఛాయ్ ఫైవ్ స్టార్ హోటల్లో అయితే వంద నుంచి ఐదొందలు ఉండచ్చేమో.. కానీ కోల్‌కతాలోని ఓ రోడ్ సైడ్ టీ షాపులో కప్పు టీ అక్షరాలా వెయ్యి రూపాయలు. ఎందుకంటే..

కోల్‌కతాలోని ముకుందాపూర్ లో పార్థ ప్రతీం గంగూలీ అనే వ్యక్తి తన టీ స్టాల్‌లో టీ కప్పు ధర రూ.1000లు. ఎందుకంటే గంగూలీ తయారు చేసే టీ చాలా వెరైటీ. ఇతను వందకు పైగా వెరైటీ టీలను తయారు చేసి అమ్ముతుంటాడు. రకరకాల సుగంధ ద్రవ్యాలతో గంగూలీ చేసే టీలకు ఇక్కడ మంచి గిరాకీ ఉంటుంది.

టీ స్టాల్ పెట్టాలనుకున్న గంగూలీ అందరిలా కాకుండా ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయాలనుకున్నాడు. దాని కోసం రీసెర్చ్ చేసి ప్రపంచవ్యాప్తంగా లభించే రకరకాల టీలను స్టడీ చేశాడు. అందులో ఓ 115 రకాల టీలు సెలక్ట్ చేసి వాటిని తన టీ స్టాల్ లో తయారు చేయడం మొదలు పెట్టాడు. కేజీ రూ. 2.8 లక్షలు పలికే జపాన్‌ స్పెషల్ టీ సిల్వర్ నీడిల్ వైట్ టీ, రూ. 50వేలు నుంచి రూ. 32 లక్షల వరకు పలికే ఉండే బో-లే టీ కూడా తన షాపులో ఉంటుంది.

గంగూలీ టీ స్టాల్ లో జపనీస్ వైట్ లీఫ్ టీ చాలా ఫేమస్. దీని ధర కప్పుకి రూ.1000. ఈ టీతోనే గంగూలీ అక్కడ ఫేమస్ అయ్యాడు. ఇన్ని వెరైటీ టీ లు పెట్టే గంగూలీని చుట్టుపక్కల ప్రజలంతా ముద్దుగా ‘పార్థ బాబూ’ అని పిలుస్తారట. అక్కడి స్థానికులు కొన్ని వెరైటీ టీలకు ముందుగానే ఇక్కడ అడ్వాన్స్ చెల్లిస్తుంటారు. గంగూలీ టీతో పాటు టీ పౌడర్‌ని కూడా అమ్ముతుంటాడు. దేశవ్యాప్తంగా చాలా మంది టీ వ్యాపారులు గంగూలీ నుంచి ముడీ టీని తీసుకెళ్తుంటారని గంగూలీ అంటున్నాడు.

First Published:  2 March 2021 1:58 AM GMT
Next Story