బెస్ట్ ఫ్రెండ్స్ మళ్లీ కలుస్తున్నారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రం మొదలుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రం వరకు దాదాపు వంద సినిమాలకు ఆర్ట్ డైరక్టర్ గా వ్యవహరించి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ సాయి. ఐదు సంవత్సరాలుగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా వర్క్ చేస్తున్నాడు ఆనంద్ సాయి. ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవటంతో తిరిగి కళాదర్శకునిగా సినిమాల్లోకి వస్తున్నాడు. ఈ క్రమంలో పవన్-హరీష్ శంకర్ […]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రం మొదలుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రం వరకు దాదాపు వంద సినిమాలకు ఆర్ట్ డైరక్టర్ గా వ్యవహరించి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ సాయి.
ఐదు సంవత్సరాలుగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా వర్క్ చేస్తున్నాడు ఆనంద్ సాయి. ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవటంతో తిరిగి కళాదర్శకునిగా సినిమాల్లోకి వస్తున్నాడు.
ఈ క్రమంలో పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు ఆర్ట్ డైరక్టర్ గా వర్క్ చేయడానికి అంగీకరించాడు ఆనంద్ సాయి. రీఎంట్రీలో ఆనంద్ సాయి ఒప్పుకున్న మొదటి సినిమా ఇదే.
ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్,దర్శకుడు హరీష్ శంకర్ లు కళా దర్శకుడు ‘ఆనంద్ సాయి’ కి ఘనస్వాగతం పలికారు.