Telugu Global
National

కర్నాటక " కేరళ మధ్య కరోనా వార్..

కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ, సరిహద్దు రాష్ట్రాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. అటు మహారాష్ట్రలో కొత్తరకం వైరస్ బయటపడిందని కేంద్రం ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో కొత్తరకం వైరస్ కారణంగా కేసుల సంఖ్య పెరగడంలేదని చెప్పడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే కరోనా కేసుల వృద్ధి ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆల్రడీ వీకెండ్ లాక్ డౌన్ మొదలైంది. పుణె సహా ఇతర ప్రధాన పట్టణాల్లో […]

కర్నాటక  కేరళ మధ్య కరోనా వార్..
X

కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ, సరిహద్దు రాష్ట్రాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. అటు మహారాష్ట్రలో కొత్తరకం వైరస్ బయటపడిందని కేంద్రం ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో కొత్తరకం వైరస్ కారణంగా కేసుల సంఖ్య పెరగడంలేదని చెప్పడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే కరోనా కేసుల వృద్ధి ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆల్రడీ వీకెండ్ లాక్ డౌన్ మొదలైంది. పుణె సహా ఇతర ప్రధాన పట్టణాల్లో ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు. మాస్క్ తప్పనిసరి, మాస్క్ లేకపోతే జరిమానా విధించే నిబంధన మళ్లీ తెరపైకి వచ్చింది. ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు సరిహద్దు సమస్యలు చుట్టుముట్టడం మరో ఎత్తు.

సరిహద్దుల్లో ఆంక్షలు విధించిన కర్నాటక..
కేరళ నుంచి కర్ణాటకలోకి ప్రవేశించేవారిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కేరళ నుంచి కర్ణాటక వచ్చేవారు 72 గంటల్లో చేయించుకున్న ఆర్టీ‌టీ-పీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉండడాన్ని తప్పనిసరి చేశారు. ఈ నిబంధనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ప్రతి 3రోజులకి ఒకసారి కచ్చితంగా ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకుంటేనే కర్నాటకలోకి ఎంట్రీ అనమాట. అలా చేయించుకోకపోతే మాత్రం వెనక్కి తిప్పి పంపించేస్తారు.

కేంద్రం వద్ద పంచాయతీ..
కర్నాటక విధించిన నిబంధనతో తమ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. దీనిపై కేంద్రం తక్షణం కల్పించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి మోదీకి ఓ లేఖ రాశారు. కొత్త ఆంక్షల కారణంగా కర్ణాటక వెళ్లే ప్రజలు, విద్యార్థులు, రోగులు, నిత్యావసరాలు తీసుకెళ్లే ట్రక్కుల డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై కర్నాటక ఆంక్షలు విధించిందని చెప్పారు. ప్రస్తుతం కర్నాటక, కేరళ మధ్య సరిహద్దు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కూడా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే వాహనాలపై నిఘా పెట్టిందనే వార్తలొస్తున్నా.. కరోనా టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ చూపించాలనే నిబంధన ఏదీ పెట్టలేదు. కర్నాటక మాత్రం ఓ అడుగు ముందుకేసి.. నెగెటివ్ రిపోర్ట్ చూపించినవారికే ఎంట్రీ అని తేల్చి చెబుతోంది. ముందుగా కేరళ బోర్డర్ ని టైట్ చేసింది. దీంతో కేరళ-కర్నాటక మధ్య కరోనా వార్ మొదలైంది, పంచాయితీ కేంద్రం ముందుకు వెళ్లింది.

First Published:  23 Feb 2021 10:45 PM GMT
Next Story