Telugu Global
National

తమిళనాట పొలిటికల్​ హీట్​.. శశికళ అడుగులు ఎటు?

తమిళనాట ఈ సారి కొంత ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో దిగ్గజ నేతలు , జయలలిత, కరుణానిధి లేరు. జయలలిత సన్నిహితురాలు శశికళ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో ప్రస్తుతం ఫోకస్​ అంతా ఆమె మీద ఉంది. శశికళ ఏం చేయబోతున్నారు? అన్నాడీఎంకేను తన చేతుల్లోకి తీసుకుంటారా? ఆ పార్టీ నేతలంతా ఆమె వెంట వెళతారా? లేదంటే ఆమె మేనల్లుడు దినకరన్ ఇప్పటికే స్థాపించిన అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం పార్టీ నుంచి […]

తమిళనాట పొలిటికల్​ హీట్​.. శశికళ అడుగులు ఎటు?
X

తమిళనాట ఈ సారి కొంత ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో దిగ్గజ నేతలు , జయలలిత, కరుణానిధి లేరు. జయలలిత సన్నిహితురాలు శశికళ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో ప్రస్తుతం ఫోకస్​ అంతా ఆమె మీద ఉంది. శశికళ ఏం చేయబోతున్నారు? అన్నాడీఎంకేను తన చేతుల్లోకి తీసుకుంటారా? ఆ పార్టీ నేతలంతా ఆమె వెంట వెళతారా? లేదంటే ఆమె మేనల్లుడు దినకరన్ ఇప్పటికే స్థాపించిన అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం పార్టీ నుంచి పోటీచేస్తారా? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

అయితే కొంతకాలం క్రితం నేషనల్​ మీడియా చేసిన సర్వేలో తమిళనాడులో స్టాలిన్​కే గెలుపు అవకాశాలు ఉన్నట్టు తేలింది. ఆయన కూడా గెలుపుమీద ధీమాతో ఉన్నారు.ఇదిలా ఉంటే శశికళ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు ఏమన్నా మారబోతున్నాయా? అన్న విషయంపై చర్చ జరుగుతున్నది. తమిళనాడులో దాదాపు దశాబ్దకాలంగా డీఎంకే అధికారంలో లేదు. దీనికి తోడు కరుణానిధి మృతిచెందారు. మరోవైపు జయలలిత మృతితో సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వం గానీ.. ఆ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన పళని స్వామి గానీ ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. వారి పాలనపట్ల జనం ఏ మాత్రం సంతృప్తిగా లేరు. దీంతో వాళ్లు ఓడిపోవడం ఖాయమని విశ్లేషణలు సాగాయి. దీంతో స్టాలిన్​ గెలుపు నల్లేరు మీదే నడకేనని భావించారంతా.

అయితే ఇప్పుడు చిన్నమ్మ ఎంట్రీతో కొంత రాజకీయ ముఖచిత్రం మారినట్టు కనిపిస్తోంది. ఆమె ప్రభావం భారీగా ఉండకపోవచ్చు.. గానీ ఎంతో కొంత ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే శశికళ తన అనుచరులను అందరినీ కలుపుకొంటూ వెళ్తున్నారు. అన్నాడీఏంకే పార్టీనే ఆమె తన చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. దీంతో ఆమె అన్నాడీఎంకేలోని అసంతృప్తులపై దృష్టి సారించారు.

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం ప్రస్తుతం పళని స్వామి తీరుపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో అతడిని తనవైపు తిప్పుకొనేందుకు శశికళ ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాక అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలను కూడా తన వైపు తిప్పుకొనేందుకు ఆమె యత్నిస్తున్నారట.
ఈ నెల 24న జయలలిత జయంతి. ఈ రోజున ఆమె అన్నాడీఎంకే కీలక నేతలు, తన అనుచరులతో సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశం అనంతరం ఆమె భవిష్యత్​ ప్రణాళికను ప్రకటించనున్నట్టు సమాచారం.

First Published:  22 Feb 2021 11:11 PM GMT
Next Story