Telugu Global
International

అలెక్సా పేరు పెట్టట్లేదట

కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చినప్పుడు వాటికి రకరకాల కొత్త పేర్లు పెడుతుంటాయి. వాటిలో చాలా వరకూ పాపులర్ అయిపోతుంటాయి. ఐఫోన్ సిరి, అమెజాన్ అలెక్సా కూడా అలాంటివే. అయితే ఇప్పుడీ పేరు హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే.. 2014లో అమెజాన్‌.. తన వర్చువల్‌ అసిస్టెంట్‌ను మార్కెట్లోకి తెచ్చినప్పుడు దానికి ఏ పేరు పెట్టాలా అని ఆలోచించి.. అమెరికాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక పేరును పెట్టింది..అదే ‘అలెక్సా’. అయితే ఇప్పుడా పేరు అసలు […]

అలెక్సా పేరు పెట్టట్లేదట
X

కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చినప్పుడు వాటికి రకరకాల కొత్త పేర్లు పెడుతుంటాయి. వాటిలో చాలా వరకూ పాపులర్ అయిపోతుంటాయి. ఐఫోన్ సిరి, అమెజాన్ అలెక్సా కూడా అలాంటివే. అయితే ఇప్పుడీ పేరు హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే..

2014లో అమెజాన్‌.. తన వర్చువల్‌ అసిస్టెంట్‌ను మార్కెట్లోకి తెచ్చినప్పుడు దానికి ఏ పేరు పెట్టాలా అని ఆలోచించి.. అమెరికాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక పేరును పెట్టింది..అదే ‘అలెక్సా’. అయితే ఇప్పుడా పేరు అసలు మనుషులకు పెట్టడం బాగా తగ్గిపోయిందట. అమెరికాలో చాలామంది తమ ఆడపిల్లలకు ఎక్కువగా పెట్టే పేర్లలో అలెక్సా కూడా ఒకటి. కానీ ఇప్పుడు అమెజాన్ ‘అలెక్సా’ పుణ్యమా అని.. ఆ పేరును ఆడపిల్లలకు పెట్టటం మానేశారు.

యూఎస్‌ సోషల్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకారం 2015లో అమెరికాలో పుట్టిన పిల్లల్లో 6,052 మందికి అలెక్సా అనే పేరు పెడితే.. 2019 సరికి అ పేరు పెట్టేవారి సంఖ్య 1995కి తగ్గిపోయిందట. 2015లో ఆడపిల్లలకు పెట్టే పాపులర్‌ పేర్లలో అలెక్సా 32వ స్థానంలో ఉండగా.. నాలుగేళ్లలో అది 139వ స్థానానికి పడిపోయింది.

Next Story