Telugu Global
NEWS

పట్టపగలే దారుణ హత్య ! పుట్టా మధుకు లింక్‌ ఉందా?

పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు లాయర్‌ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. పట్టపగలే..రోడ్డు మీద అందరూ చూస్తుండగానే దుండగులు ఇద్దరు దంపతులను కత్తులతో నరికి చంపారు. మంథని కోర్టులో పని చూసుకుని హైదరాబాద్‌కు వెళుతుండగా రామగిరి మండలం కల్వచర్ల పెట్రోల్‌ బంకు ఎదురుగా దుండగులు అడ్డగించి దాడికి పాల్పడ్డారు, కారులో ఉన్న వామన్‌రావు, నాగమణిపై విచక్షణరహితంగా కత్తులతో దాడి చేశారు. రెండు బస్సుల్లో జనం కిటికిలో నుంచి చూస్తుండగానే.. బైకులపై జనం ఆగి చూస్తుండగానే […]

పట్టపగలే దారుణ హత్య ! పుట్టా మధుకు లింక్‌ ఉందా?
X

పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు లాయర్‌ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. పట్టపగలే..రోడ్డు మీద అందరూ చూస్తుండగానే దుండగులు ఇద్దరు దంపతులను కత్తులతో నరికి చంపారు. మంథని కోర్టులో పని చూసుకుని హైదరాబాద్‌కు వెళుతుండగా రామగిరి మండలం కల్వచర్ల పెట్రోల్‌ బంకు ఎదురుగా దుండగులు అడ్డగించి దాడికి పాల్పడ్డారు, కారులో ఉన్న వామన్‌రావు, నాగమణిపై విచక్షణరహితంగా కత్తులతో దాడి చేశారు. రెండు బస్సుల్లో జనం కిటికిలో నుంచి చూస్తుండగానే.. బైకులపై జనం ఆగి చూస్తుండగానే రోడ్డు మీద పడేసి వామన్‌రావును హతమార్చారు.

విచక్షణ రహితంగా కత్తితో దాడి చేయడంతో వామన్‌రావు కడుపులో నుంచి పేగులు బయటకు వచ్చాయి. ఆయన చివరి నిమిషంలో సాయం కోసం అరిచారు. చావు బతుకుల మధ్య ఉన్న టైమ్‌లో తనపై దాడి చేసింది మంథని మండలం టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ పేరును చెప్పారు. ప్రత్యక్ష సాక్షులు తీసిన వీడియోలో ఈపేరే వినిపించింది. ఇటు వామన్‌రావు సోదరుడు కూడా కుంట శ్రీనివాస్, కుమార్‌లపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు చెప్పారు.

ఇటు రామగిరి ఎస్‌ఐ మహేందర్‌పై కూడా వామన్‌రావు బంధువులు ఆరోపణలు చేశారు. ప్రాణహాని ఉందని ఇంతకుముందే ఫిర్యాదు చేసినపుడు సెక్యూరిటీ కల్పించలేదని వాపోయారు. ఎస్‌ఐకు ఈ వ్యవహారం తెలిసే జరిగిందని ఆరోపించారు. పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్టా మధుకు కుంట శ్రీనుకు మంచి సంబంధాలు ఉన్నాయని…మధు ప్రోదల్భంతోనే ఈ హత్య జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కూడా హత్య వెనుక అసలు సూత్రధారులను పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు సహకరించడం వల్లే ఇదంతా జరిగిందని…నేర విచారణలో కీలకమైన సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ను పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు.

First Published:  17 Feb 2021 9:28 PM GMT
Next Story