Telugu Global
NEWS

కేశినేని వర్సెస్‌ తమ్ముళ్లు ! బెజవాడ టీడీపీలో కోల్డ్‌ వార్‌ !

బెజవాడ తెలుగుదేశంలో విభేదాలు ముదిరాయి. నిన్నటివరకూ గ్రూపు మీటింగ్‌లు తో సరిపెట్టుకున్న తమ్ముళ్లు ఇప్పుడు ఏకంగా రోడ్డున పడ్డారు. 39వ డివిజన్ అభ్యర్థిని రాత్రికి రాత్రి మార్చడంపై కేశినేని నానితో మరో వర్గం గొడవకు దిగారు. మొన్నటి వరకు అభ్యర్థిగా ఉన్న పూజితను తప్పుకోవాలని ఎంపీ కేశినేని తేల్చి చెప్పారు. కేశినేని ఎవరు అని తనని తప్పుకోవాలని అంటున్నారని ప్రశ్నిస్తున్నారు. కేశినేని, బుద్ధా వెంకన్న వర్గీయుల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. పార్టీ మారిన వాళ్లను ఎంపీ […]

కేశినేని వర్సెస్‌ తమ్ముళ్లు ! బెజవాడ టీడీపీలో కోల్డ్‌ వార్‌ !
X

బెజవాడ తెలుగుదేశంలో విభేదాలు ముదిరాయి. నిన్నటివరకూ గ్రూపు మీటింగ్‌లు తో సరిపెట్టుకున్న తమ్ముళ్లు ఇప్పుడు ఏకంగా రోడ్డున పడ్డారు. 39వ డివిజన్ అభ్యర్థిని రాత్రికి రాత్రి మార్చడంపై కేశినేని నానితో మరో వర్గం గొడవకు దిగారు. మొన్నటి వరకు అభ్యర్థిగా ఉన్న పూజితను తప్పుకోవాలని ఎంపీ కేశినేని తేల్చి చెప్పారు. కేశినేని ఎవరు అని తనని తప్పుకోవాలని అంటున్నారని ప్రశ్నిస్తున్నారు.

కేశినేని, బుద్ధా వెంకన్న వర్గీయుల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. పార్టీ మారిన వాళ్లను ఎంపీ ప్రోత్సహిస్తున్నారని బుద్ధా వర్గీయులు కేశినేనిని నిలదీశారు. దీనికి ధీటుగా సమాధానం ఇచ్చారు ఎంపీ. తాను తప్పు చేస్తే పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకున్నాం.. చంద్రబాబు చేసింది తప్పు కాదా అని ప్రశ్నించారు కేశినేని. పార్టీలో ఎవరు తప్పు చేసినా వారిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.

విజయవాడ వెస్ట్‌లో కీలక నేతల మధ్య గ్రూపు వార్‌ నడుస్తోంది. 39వ డివిజన్‌లో పార్టీ అభ్యర్థిగా పూజిత పేరును ప్రకటించారు. ఆమె ప్రచారం కూడా నిర్వహించారు. వీళ్లంతా బుద్ధా వెంకన్న వర్గీయులు. ఇప్పుడు ఎంపీ కేశినేని నాని.. శివ అనే మరో అభ్యర్థికి బీఫారం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు పూజిత. 39వ డివిజన్‌లో పార్టీ ఆఫీస్‌ ప్రారంభానికి వచ్చిన సమయంలో రోడ్డుపైనే కేశినేని నానిని ప్రశ్నించారు మహిళలు. తమను ప్రకటించాక మరొకరికి బీఫారం ఇవ్వడం ఏంటని నిలదీశారు. వైసీపీలో ఉన్నప్పుడు శివ.. ఎంపీని తిట్టారని, అలాంటి వారికే సీటు ఇవ్వడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడ వెస్ట్‌లో ఇక్కడ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మరో నేత నాగుల్‌ మీరా ఒక గ్రూపుగా ఉన్నారు. అందులో భాగంగానే బుద్ధా వెంకన్న వర్గంలోని పూజితను కాదని.. మరొకరికి ఎంపీ బీఫారం ఇచ్చారనే చర్చ తమ్ముళ్లలో జరుగుతోంది. ఏదైనా ఉంటే తనపై పార్టీకి ఫిర్యాదు చేసుకోవచ్చని, రోడ్డుపై గొడవ చేయొద్దని బుద్ధా వెంకన్న వర్గీయులకు తేల్చి చెప్పారు కేశినేని నాని. గతంలో చంద్రబాబును తిట్టిన వారే టీడీపీలో చేరారని గుర్తు చేశారు.వచ్చే నెలలోనే కార్పొరేషన్‌ ఎన్నికలు జరగబోతున్న వేళ.. ఈ గ్రూపుల గోల పార్టీపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనలో ఉన్నారు తమ్ముళ్లు.

First Published:  18 Feb 2021 3:39 AM GMT
Next Story