Telugu Global
NEWS

రైతుల భూములు లాక్కొని ‘రియల్’ వ్యాపారం..! రేవంత్​

సీఎం కేసీఆర్​పై కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వం పచ్చని పంట పొలాలను భూ సేకరణ పేరిట లాక్కొని ప్రైవేట్​ కంపెనీలకు కట్టబెట్టిందని ఆరోపించారు. రేవంత్​రెడ్డి రాజీవ్​ రైతు భరోసా యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అచ్చంపేటలో మొదలైన ఈ పాదయాత్ర ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో సాగుతోంది. ఇవాళ కందుకూరు, కడ్తాల్​, యాచారం గ్రామాల గుండా రేవంత్​ పాదయాత్ర చేశారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వం భూ సేకరణ జరిపిన […]

రైతుల భూములు లాక్కొని ‘రియల్’ వ్యాపారం..! రేవంత్​
X

సీఎం కేసీఆర్​పై కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వం పచ్చని పంట పొలాలను భూ సేకరణ పేరిట లాక్కొని ప్రైవేట్​ కంపెనీలకు కట్టబెట్టిందని ఆరోపించారు. రేవంత్​రెడ్డి రాజీవ్​ రైతు భరోసా యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అచ్చంపేటలో మొదలైన ఈ పాదయాత్ర ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో సాగుతోంది.

ఇవాళ కందుకూరు, కడ్తాల్​, యాచారం గ్రామాల గుండా రేవంత్​ పాదయాత్ర చేశారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వం భూ సేకరణ జరిపిన విషయం తెలిసిందే. రైతులు తమకు సరైన పరిహారం అందలేదని చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రూ. కోట్ల విలువైన భూములను ప్రభుత్వం తక్కువ ధరకు సేకరించిందని ఆయన ఆరోపించారు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ప్రైవేట్​ కంపెనీల కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు.

త్వరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగక తప్పదని జోస్యం చెప్పారు. రైతుల భూములకు తక్కువ పరిహారం చెల్లించిన కేసీఆర్​.. ఇదే ధరకు తన ఫామ్​హౌస్​ దగ్గర ఉన్న భూమిని ఇస్తారా? అని ప్రశ్నించారు. రైతులంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విలువలేకుండా పోయిందని విమర్శించారు.

మరోవైపు రేవంత్​ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తున్నది. అయితే ఈ యాత్రపై కాంగ్రెస్​ ముఖ్యనేతలు మాత్రం గుర్రుగా ఉండటం గమనార్హం. మరికాసేపట్లో రావిరాలలో రేవంత్​ పాదయాత్ర ముగింపు సభ జరుగనున్నది. ఈ సభకు కాంగ్రెస్​ నేతలు హాజరవుతారా? లేదా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

First Published:  16 Feb 2021 7:34 AM GMT
Next Story