Telugu Global
National

గొంతుకోసినా నా నినాదం అదే.. ! మమత మేనల్లుడు..!

పశ్చిమబెంగాల్​లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ.. టీఎంసీ నేతలు ఒకరిపై ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు టీఎంసీ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మమతా బెనర్జీపైనే సవాలు విసురుతున్నారు. బీజేపీ జాతీయ నేతలు నిత్యం పశ్చిమబెంగాల్​లో పర్యటిస్తూ .. మమతపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్​ బెనర్జీ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దక్షిణ కోల్​కతాలో నిర్వహించిన […]

గొంతుకోసినా నా నినాదం అదే.. ! మమత మేనల్లుడు..!
X

పశ్చిమబెంగాల్​లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ.. టీఎంసీ నేతలు ఒకరిపై ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు టీఎంసీ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మమతా బెనర్జీపైనే సవాలు విసురుతున్నారు. బీజేపీ జాతీయ నేతలు నిత్యం పశ్చిమబెంగాల్​లో పర్యటిస్తూ .. మమతపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్​ బెనర్జీ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

దక్షిణ కోల్​కతాలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘కొందరు బయట వ్యక్తులు బెంగాల్​లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ ఎలాగైనా గెలవాలని డబ్బు సంచులతో వచ్చారు. వాళ్లకు బెంగాల్ ప్రజలు బుద్ధి చెప్పాలి. డబ్బు తీసుకొని ఓటు మాత్రం టీఎంసీకి వెయ్యాలి. ఇది బెంగాల్​ ప్రజలకు బయటశక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో బెంగాల్​ ప్రజలే గెలుపొందాలి. ప్రాణం పోయేవరకు నేను టీఎంసీలోనే ఉంటా. నా గొంతు కోసినా.. జై బంగ్లా, జై టీఎంసీ అనే నినాదం ఇస్తా’ అంటూ ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.

మరోవైపు టీఎంసీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. మరోవైపు ఎంపీ దినేశ్​ త్రివేది టీఎంసీ పార్టీకి రాజీనామా చేశారు. టీఎంసీలో తాను ఉక్కరిబిక్కిరి అయ్యానని,ఒక అసహాయకుడిగా మిగిలిపోయానని త్రివేది ఆరోపించారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.

First Published:  14 Feb 2021 4:19 AM GMT
Next Story