Telugu Global
Health & Life Style

బయోలాజికల్-ఈ నుంచి ఏడాదికి 60 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు.. జాన్సన్‌తో ఒప్పందం

హైదరాబాద్ నగరం నుంచి మరో కరోనా వ్యాక్సిన్ రాబోతున్నది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి నుంచి బయటపడేయటానికి అనేక వ్యాక్సిన్లు అభిృద్ది చేశారు. వీటిలో ఇండియా నుంచి తయారైన కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ది చేసింది. ఇక రెండోదైన కోవిషీల్డ్‌ను సీరమ్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నది. ప్రస్తుతం ఇండియాలో ఈ రెండు వాక్సిన్లనే ఫ్రంట్ లైన్ వారియర్లకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు వీటికి తోడు ఇండియాలో మరో వాక్సిన్ రాబోతున్నది. హైదరాబాద్ కేంద్రంగా పని […]

బయోలాజికల్-ఈ నుంచి ఏడాదికి 60 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు.. జాన్సన్‌తో ఒప్పందం
X

హైదరాబాద్ నగరం నుంచి మరో కరోనా వ్యాక్సిన్ రాబోతున్నది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి నుంచి బయటపడేయటానికి అనేక వ్యాక్సిన్లు అభిృద్ది చేశారు. వీటిలో ఇండియా నుంచి తయారైన కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ది చేసింది. ఇక రెండోదైన కోవిషీల్డ్‌ను సీరమ్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నది. ప్రస్తుతం ఇండియాలో ఈ రెండు వాక్సిన్లనే ఫ్రంట్ లైన్ వారియర్లకు పంపిణీ చేస్తున్నారు.

ఇప్పుడు వీటికి తోడు ఇండియాలో మరో వాక్సిన్ రాబోతున్నది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న బయోలాజికల్-ఈ అనే సంస్థ ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నది. అయితే ఈ వ్యాక్సిన్‌ను ప్రఖ్యాత జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అభివృద్ది చేసింది. ఈ వ్యాక్సిన్‌ను వాణిజ్యంగా ఉత్పత్తి చేయడానికి బయోలాజికల్-ఈ సంస్థకు అనుమతి ఇచ్చింది. ఏడాదికి 60 కోట్ల డోసులు బయోలాజికల్-ఈ తయారు చేయనున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల చెప్పారు. జాన్సెన్ ఫార్మాష్యుటికల్స్‌తో ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు మహిమ స్పష్టం చేశారు.

ఫైజర్, మోడెర్న కంపెనీలు తయారు చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. పైగా వీటిని నిల్వ చేయడానికి ప్రత్యేక గోదాములు అవసరం అవుతాయి. డోసు ఇచ్చే ముందు మాత్రమే వాటిని బయటకు తీయాల్సి ఉంటుంది. కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్ ఒక్క షాట్ ఇస్తే సరిపోతుంది. పైగా ఈ వ్యాక్సిన్‌ను సాధారణ రిఫ్రిజిరేటర్లలో కూడా భద్రపరిచే వీలుంది. దీనివల్ల ఏ మారు మూల ప్రాంతానికైనా ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేయవచ్చని జాన్సెన్ ఫార్మా తెలిపింది.

జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌లో సాధారణ జలుబు వైరస్, అడెనో వైరస్ 26తోపాటు కరోనా వైరస్ ప్రోటీన్స్ కూడా ఉండటం వల్ల ఈ డోసు తీసుకున్న వ్యక్తిలో ఇమ్యూనిటీ పెరుగుతుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం అమెరికాలోని రెగ్యులేటరీ రివ్యూలో ఉన్న ఈ డోసుకు సంబంధించి అత్యవసర సమయంలో ఉపయోగించడానికి అనుమతి కావాలంటూ దరఖాస్తు చేసింది.

కాగా, ఇండియాలో మాత్రం ఇంకా అనుమతులు రాలేదని.. త్వరలోనే ఈ వ్యాక్సిన్ ఉపయోగించడానికి అనుమతులు వస్తాయని బయోలాజికల్-ఈ తెలిపింది. అయితే అప్పటి వరకు ఉత్పత్తి చేసిన డోసులను ఎగుమతులు చేయనున్నట్లు వారు తెలిపారు.

First Published:  12 Feb 2021 5:18 AM GMT
Next Story