Telugu Global
NEWS

‘పంచాయతీ’ ఫలితాల్లో వైసీపీ జోరు.. అన్ని జిల్లాల్లోనూ హవా..!

ఆంధ్రప్రదేశ్​లో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ సత్తా చాటగా.. టీడీపీ డీలా పడింది. ఇక జనసేన​-బీజేపీ కనీసం చెప్పుకోదగ్గ స్థానాల్లో కూడా గెలవలేకపోయాయి. ఏపీ వ్యాప్తంగా తొలిదశలో 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 80 శాతం పోలింగ్​ అయినట్టు సమాచారం. సర్పంచ్ స్థానాల్లో 7,506 మంది.. వార్డులకు 43,601 మంది పోటీలో నిలిచారు. తొలివిడతలో 3,249 […]

‘పంచాయతీ’ ఫలితాల్లో వైసీపీ జోరు.. అన్ని జిల్లాల్లోనూ హవా..!
X

ఆంధ్రప్రదేశ్​లో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ సత్తా చాటగా.. టీడీపీ డీలా పడింది. ఇక జనసేన​-బీజేపీ కనీసం చెప్పుకోదగ్గ స్థానాల్లో కూడా గెలవలేకపోయాయి. ఏపీ వ్యాప్తంగా తొలిదశలో 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 80 శాతం పోలింగ్​ అయినట్టు సమాచారం.

సర్పంచ్ స్థానాల్లో 7,506 మంది.. వార్డులకు 43,601 మంది పోటీలో నిలిచారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. వీటిలో ఇప్పటికే 500 పంచాయతీలు వైసీపీ మద్దతుదారులు, 18 చోట్ల టీడీపీ మద్దతుదారులు, 7చోట్ల ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల ఫలితాల్లోనూ వైసీపీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం వైసీపీ మద్దతుదారులు 2567 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ బలపరిచిన అభ్యర్థులు కేవలం 523 స్థానాల్లో, బీజేపీ జనసేన మద్దతుతో బరిలో నిలిన వాళ్లు 47 స్థానాల్లో , ఇతరులు 86 స్థానాల్లో గెలుపొందారు. 26 చోట్ల ఇంకా ఫలితాలు తేలాల్సి ఉన్నది.
అయితే అన్ని జిల్లాల్లోనూ అధికార వైసీపీ దూసుకుపోతున్నది. టీడీపీ ఏ జిల్లాలోనూ చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలుపొందలేదు.

జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి..

శ్రీకాకుళం వైసీపీ 261 స్థానాల్లో గెలుపొందగా.. టీడీపీ 57 స్థానాల్లో విజయం సాధించింది.విశాఖపట్టణం జిల్లాలో వైసీపీ 254 స్థానాల్లో టీడీపీ 56 స్థానాల్లో బీజేపీ 1 స్థానంలో, ఇతరులు 29 స్థానాల్లో విజయం సాధించారు.
తూర్పుగోదావరి జిల్లాలో 320 స్థానాల్లో వైసీపీ, 31 స్థానాల్లో టీడీపీ, 4 చోట్ల బీజేపీ, జనసేన మద్దతు దారులు గెలుపొందారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 170 స్థానాల్లో వైసీసీ, 36 స్థానాల్లో టీడీపీ 30 చోట్ల బీజేపీ, జనసేన కూటమి విజయం సాధించింది.
కృష్ణా జిల్లాలో 191 స్థానాల్లో వైసీపీ, 37 స్థానాల్లో టీడీపీ విజయం సాధించగా.. బీజేపీ కూటమి కేవలం 1 చోట గెలుపొందింది.

గుంటూరు జిల్లాలో 241 స్థానాల్లో వైసీపీ, 73 చోట్ల టీడీపీ 4 స్థానాల్లో బీజేపీ, జనసేన కూటమి, ఇతరులు 19 స్థానాలో విజయం సాధించారు.
ప్రకాశం జిల్లాలో 163 స్థానాల్లో వైసీపీ, 58 చోట్ల టీడీపీ ఇతరులు 6 స్థానాల్లో విజయం సాధించారు.
కర్నూల్​ జిల్లాలో 162 స్థానాల్లో వైసీపీ మద్దతు దారులు, 31 చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు
అనంతపురం జిల్లాలో 143 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు, 26 చోట్ల టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు.
కడపలో 161 చోట్ల వైసీపీ మద్దతుదారులు, 18 చోట్ల టీడీపీ మద్దతుదారులు, 1 చోట ఇతరులు గెలుపొందారు.
నెల్లూరు జిల్లాలో 131 చోట్ల వైసీపీ మద్దతు దారులు 25 చోట్ల టీడీపీ మద్దతు దారులు గెలుపొందారు.
చిత్తూరు జిల్లాలో 375 వైసీపీ, 75 టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 5 స్థానాల్లో విజయం సాధించింది.

First Published:  10 Feb 2021 4:17 AM GMT
Next Story