Telugu Global
NEWS

జగన్ ఉక్కు మనిషి " చంద్రబాబు తుక్కు మనిషి..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ సీఎం జగన్, ప్రధాని మోదీకి లేఖ రాశారని ఆయన తెలిపారు. వైసీపీ ఎంపీలంతా కలసి ఇదే విషయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మెమొరాండం అందించామని చెప్పారాయన. మేజర్‌ పోర్టుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా వైసీపీ వ్యతిరేకిస్తుందని ఆర్థిక మంత్రికి స్పష్టం చేసినట్టు తెలిపారు విజయసాయిరెడ్డి. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం, జాతీయ […]

జగన్ ఉక్కు మనిషి  చంద్రబాబు తుక్కు మనిషి..
X

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ సీఎం జగన్, ప్రధాని మోదీకి లేఖ రాశారని ఆయన తెలిపారు. వైసీపీ ఎంపీలంతా కలసి ఇదే విషయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మెమొరాండం అందించామని చెప్పారాయన. మేజర్‌ పోర్టుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా వైసీపీ వ్యతిరేకిస్తుందని ఆర్థిక మంత్రికి స్పష్టం చేసినట్టు తెలిపారు విజయసాయిరెడ్డి. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం, జాతీయ ఆస్తులు ప్రైవేటీకరణ చేయటం పరిష్కారం కాదని చెప్పారు.

RRR
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా వైసీపీ తరపున RRR ప్రతిపాదన చేశామని తెలిపారు విజయసాయిరెడ్డి. రీస్ట్రక్చరింగ్( restructuring), రీవాంపింగ్ (revamping), రివైవింగ్ (reviving) అనే సూచనలు చేసినట్టు చెప్పారు. ఇవి అమలు చేస్తే విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకురావొచ్చని సూచించారు.

జగన్ ఉక్కు – బాబు తుప్పు
తన హయాంలో 56 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చంద్రబాబు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకకరణకు వ్యతిరేకంగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు విజయసాయిరెడ్డి. వాజ్‌ పేయి హయాంలో తాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ప్రస్తుతం వాజ్‌ పేయి లేరు కాబట్టి బాబు ఎన్ని గొప్పలైనా చెప్పుకుంటారని అన్నారు. చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలని, విశాఖ ఉక్కుకన్నా బాబుకి.. సుజనా స్టీల్స్ బాగా తెలుసని ఎద్దేవా చేశారు. సుజనా చౌదరి, లగడపాటి, రాయపాటి, కావూరి, లింగమనేని వంటి వారు బ్యాంకులను లక్షల కోట్లకు ముంచేశారని, వారంతా ఇప్పుడు ప్రవచనాలు చెబుతున్నారని, చంద్రబాబు తొత్తులుగా మారి నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

విభజన చట్టం హామీలకోసం పట్టు..
విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై ఆర్థికమంత్రికి వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు విజయసాయిరెడ్డి. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ ఖండ్ ప్యాకేజీ కింద ఇచ్చిన హామీలను ఏపీకి కూడా అమలు చేయాలని కోరారు. దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టులను కేంద్రమే నిర్మించాలని కోరారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా తగ్గిపోతోందని, జనాభా ప్రకారం ఈ వాటాను ఇస్తున్నారని, వైశాల్యం ఎక్కువ ఉన్నా, జనాభా నియంత్రణ చర్యలు తీసుకుంటున్న రాష్ట్రాలు ఆమేరకు నష్టపోతున్నాయని అన్నారు విజయసాయిరెడ్డి. జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ లో పన్నుల వాటాలను పంపకం చేసే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ ఎంపీలు కోరినట్టు తెలిపారు. పీఎం కిసాన్ పథకంలో కూడా ఏపీ వాటా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేటాయింపుల్లో కూడా క్షీణత కనిపిస్తోందని చెప్పారు. పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచాలని వైసీపీ తరపున వినతిపత్రం అందించామన్నారు. గతంలో ఆరోగ్య రంగానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేసేవారని, కానీ ఇప్పుడు ఆరోగ్యంతో పాటు నీటి, పారిశుద్ధ్య రంగాలను కూడా జోడించి గతం కంటే ఎక్కువ కేటాయింపులు చేశామని కేంద్రం చెబుతోందని, దీనివల్ల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని వివరించారు.

First Published:  9 Feb 2021 10:27 AM GMT
Next Story