Telugu Global
NEWS

లోకేష్‌ని గ్రామ స‌ర్పంచ్‌గానైనా పోటీచేయించాల్సింది.. " విజ‌యసాయిరెడ్డి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమించే అధికారం ఉన్న గవర్నర్ కు, శాసన సభ రికమండేషన్ మీద ఆయన్ను తొలగించే అధికారం కూడా ఉండాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఆమేరకు రాజ్యాంగ సవరణ చేయాలని వైసీపీ ఎంపీల బృందం కోరింది. ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రాజ్యాంగానికి అతీతంగా పనిచేస్తున్నారని, చపల చిత్తంతో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు విజయసాయిరెడ్డి. ఓటు హక్కుకోసం దరఖాస్తు చేయడం తెలియని వ్యక్తికి, ఎన్నికల కమిషనర్‌గా ఉండే హక్కు ఉందా అని ప్రశ్నించారాయన. పిచ్చివాడి చేతిలో రాయిలా […]

లోకేష్‌ని గ్రామ స‌ర్పంచ్‌గానైనా పోటీచేయించాల్సింది..  విజ‌యసాయిరెడ్డి
X

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమించే అధికారం ఉన్న గవర్నర్ కు, శాసన సభ రికమండేషన్ మీద ఆయన్ను తొలగించే అధికారం కూడా ఉండాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఆమేరకు రాజ్యాంగ సవరణ చేయాలని వైసీపీ ఎంపీల బృందం కోరింది. ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రాజ్యాంగానికి అతీతంగా పనిచేస్తున్నారని, చపల చిత్తంతో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు విజయసాయిరెడ్డి. ఓటు హక్కుకోసం దరఖాస్తు చేయడం తెలియని వ్యక్తికి, ఎన్నికల కమిషనర్‌గా ఉండే హక్కు ఉందా అని ప్రశ్నించారాయన. పిచ్చివాడి చేతిలో రాయిలా రాష్ట్రంలో ఈసీ తయారైందని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచే సమయంలో.. అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడుని ఎలా ఉపయోగించుకున్నారో.. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడవడానికి ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డను చంద్రబాబు అలా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. మంగళగిరిలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన కొడుకు నారా లోకేష్ ను ఎంపీటీసీ, జడ్పీటీసీ గా అయినా నిలబెట్టి గెలిపిస్తాడనుకుంటే దానికి కూడా చంద్రబాబు సాహసం చేయడంలేదని, కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీకి అయినా లోకేష్‌ను నిల‌బెట్టి ఉండాల్సింద‌ని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

First Published:  9 Feb 2021 10:43 AM GMT
Next Story