Telugu Global
National

చమోలీ ప్రమాదానికి కారణాలివే..

ఉత్తరాఖండ్ లో నిన్న జరిగిన ప్రమాదంలో దాదాపు 170 మంది గల్లంతయ్యారు. జరిగిన విపత్తుని ఎవరూ ముందుగా ఊహించలేకపోయారు. ఉన్నట్టుండి మంచు చరియలు విరిగి పడడంతో నీరు ఉదృతంగా పారి, నదీ ప్రవాహం పెరిగింది. దాంతో ధౌలిగంగా నది వరదలా మారి దిగువన ఉన్న ప్రాంతాలను ముంచేసింది. అసలు ఉన్నట్టుండి సడెన్ గా ఇలా జరగడానికి కారణాలేంటి? నిన్న ప్రమాదం జరిగిన హిమాలయ ప్రాంతం హిందుఖుష్ పర్వత శ్రేణి కిందకు వస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద […]

చమోలీ ప్రమాదానికి కారణాలివే..
X

ఉత్తరాఖండ్ లో నిన్న జరిగిన ప్రమాదంలో దాదాపు 170 మంది గల్లంతయ్యారు. జరిగిన విపత్తుని ఎవరూ ముందుగా ఊహించలేకపోయారు. ఉన్నట్టుండి మంచు చరియలు విరిగి పడడంతో నీరు ఉదృతంగా పారి, నదీ ప్రవాహం పెరిగింది. దాంతో ధౌలిగంగా నది వరదలా మారి దిగువన ఉన్న ప్రాంతాలను ముంచేసింది.

అసలు ఉన్నట్టుండి సడెన్ గా ఇలా జరగడానికి కారణాలేంటి?
నిన్న ప్రమాదం జరిగిన హిమాలయ ప్రాంతం హిందుఖుష్ పర్వత శ్రేణి కిందకు వస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మంచు పర్వతాలు ఉన్న ప్రాంతం. భూమి మీద ఉష్ణోగ్రత చల్లగా ఉన్నంత వరకూ ఇక్కడి మంచుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. భూతాపం పెరిగినప్పుడే.. క్రమంగా మంచు కరగడం మొదలవుతుంది. అంటే గత కొంత కాలంగా ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పులు, భూమిపై వేడి పెరగడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పర్యావరణవేత్తలు చెప్తున్నారు.

భూతాపం పెరిగి..
ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం వల్ల భూమిపై ఉన్న మంచు కరిగి, కొండల్లా పేరుకుని ఉన్న మంచు ఏదో ఒక టైంలో విరిగి పడిపోతుంది. ఇలా జరిగినప్పుడు ఆ హిమనీ నదాలు దిగువన ఉన్న ప్రాంతాల్లోకి వరదల్లా దూసుకుపోతాయి. నదిలో ఉండే నీటితో పాటు విరిగిపడిన మంచు చరియల్లోని నీరుకూడా చేరి నీటి ఉదృతం మరింత ఎక్కువవుతుంది. సరిగ్గా నిన్న జరిగింది కూడా అదే. మంచు చరియ విరిగి ధౌలీగంగా నది వరదలా పారింది.

మున్ముందు ప్రమాదమే..
శీతాకాలంలో కూడా మంచు కరుగుతుందంటే.. వాతావరణంలో వేడి ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. భూమిపై ఇలా వేడి పెరగడానికి చాలానే కారణాలున్నాయి. మన రోడ్లపై తిరిగే వాహనాల నుంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల వరకూ అన్నీ ఈ భూమికి నష్టాన్ని కలిగించేవే. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇది ఎంతగా పెరిగిందంటే.. ఎక్కడో అంటార్కిటికా లో ఉన్న మంచు కొండలు కూడా విరిగి పడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే.. అంటార్కిటికాలో మంచు కరిగి క్రమంగా సముద్ర మట్టం పెరుగుతుందని, ఫలితంగా సముద్రం మధ్యలో ఉండే కొన్ని దేశాలు కూడా కనుమరుగైపొతాయని పర్యావరణవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. నిన్న జరిగిన ప్రమాదం కూడా ఒక హెచ్చరిక లాగానే భావించాలి. హిమాలయాలకు దిగువన కొన్ని రాష్ట్రాలు, లక్షలమంది జనాలు నివసిస్తున్నారు. భూమి తాపం రోజరోజుకీ పెరుగుతూ పోతుంటే.. మంచు కూడా రోజురోజుకీ కరుగుతూ వస్తుంది. అప్పుడు హిమనీ నదాల్లో నీటిశాతం పెరిగి వరదలు సంభవిస్తాయి. చలికాలంలోనే ఇలాంటి విపత్తు జరిగిందంటే.. వర్షాకాలంలో ఇవి ఎంత ప్రమాదమో ఊహించుకోవచ్చు. అందుకే ఇప్పటికైనా భూమిపై వేడిని పెంచే కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి.

మనమేం చేయాలి?
గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలి. పొల్యూషన్ తగ్గించాలి. సోలార్ విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు లాంటి వాటిని వాడాలి. చెట్లను నరికివేయకుండా మరిన్ని కొత్త చెట్లు నాటాలి.

ప్రభుత్వం ఏం చేయాలి?
గ్రీన్ హౌస్ ఉద్గారాలను 35శాతం తగ్గిస్తామని భారత్ హామీ ఇచ్చింది. ఆ దిశగా చర్యలు జరగాలి. దేశంలో అటవీ విస్తీర్ణం పెంచాలి. పునరుత్పాదక(రెన్యూవబుల్) ఎనర్జీ సోర్సెస్ ను వాడాలి.

బ్యాలెన్స్ చేస్తుంది
ప్రతి పదేళ్లకు ఉష్ణోగ్రతల్లో వేగవంతమైన మార్పులొస్తున్నాయని, భూమిపై వేడి క్రమంగా పెరుగుతుందని.. ఇది మానవాళికే ఎంతో ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోగలిగినప్పుడే ఈ భూమి మీద నివసించడం సాధ్యమవుతుంది. లేదంటే పకృతి తనకు ఇంబాలెన్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దాన్నే మనం ప్రకృతి విపత్తు అని పిలుస్తాం.

First Published:  8 Feb 2021 2:10 AM GMT
Next Story