Telugu Global
NEWS

పెద్దిరెడ్డికి ఫ్రీడం " నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి, ఎన్నికల సంఘానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికలు సజావుగా జరగకుండా అడ్డుపడుతున్నాడని ఆరోపిస్తూ మంత్రి పెద్దిరెడ్డిని హౌజ్ అరెస్టు చేయాలంటూ ఎస్ఈసీ ఆదేశాలు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. పెద్దిరెడ్డిని ఈ నెల 21 వరకు ఆయన ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలని డీజీపీని కోరుతూ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ధాఖలైన పిటీషన్ పై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు […]

పెద్దిరెడ్డికి ఫ్రీడం  నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ
X

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి, ఎన్నికల సంఘానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికలు సజావుగా జరగకుండా అడ్డుపడుతున్నాడని ఆరోపిస్తూ మంత్రి పెద్దిరెడ్డిని హౌజ్ అరెస్టు చేయాలంటూ ఎస్ఈసీ ఆదేశాలు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. పెద్దిరెడ్డిని ఈ నెల 21 వరకు ఆయన ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలని డీజీపీని కోరుతూ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ధాఖలైన పిటీషన్ పై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు నిమ్మగడ్డకు షాక్ ఇచ్చింది. పెద్దిరెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేయాలనే ఆదేశాలు చెల్లవని తీర్పును వెలువరించింది.

కమిషనర్‌గా తనకు ఉన్న ప్రత్యేక అధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని నిమ్మగడ్డ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు పెద్దిరెడ్డిని మీడియాతో మాట్లాడకుండా నియంత్రించాలని డీజీపీని కోరారు. ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెద్దిరెడ్డి దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై ఆదివారం హైకోర్టు విచారణ జరిపింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత మంత్రిగా పెద్దిరెడ్డికి ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు.

ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, ముందుగా నోటీసులు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేసిందని న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి తరఫున వాదించారు. ఆదివారం రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ ప్రకారం మంత్రి పాల్గొనాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని ఎస్ఈసి న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రాష్ట్రపతి పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొనవచ్చని పేర్కొంది. మంత్రి ఇంటికే పరిమితం కావాలనే ఈఎస్ఈ ఆదేశాలను రద్దు చేసింది. రాష్ట్ర మంత్రిగా ఆయన ఎక్కడైనా పర్యటించవచ్చని స్పష్టం చేసింది.

కాగా.. ఎన్నికల సంఘం తీరు పట్ల అధికార పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టానుసారం వ్యవహరించడం తగదని వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నిమ్మగడ్డ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, ఉద్దేశ్యపూర్వకంగా వైసీపీ ఏకగ్రీవాలను ప్రకటించకుండా అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు.

First Published:  7 Feb 2021 4:47 AM GMT
Next Story