Telugu Global
NEWS

తిరుపతి విషయంలో వైసీపీ సైలెంట్ స్ట్రాటజీ..

తిరుపతి ఉప ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించి హడావిడి చేసిన వేళ, బీజేపీ-జనసేన అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతున్న వేళ, అధికార వైసీపీ మాత్రం ఇంకా అధికారికంగా తన అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ప్రచార పర్వంలో మాత్రం వైసీపీ సైలెంట్ స్ట్రాటజీ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి కీలక నేతలందరితో మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని తాజాగా గురుమూర్తి కలిశారు, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఫిజియో […]

తిరుపతి విషయంలో వైసీపీ సైలెంట్ స్ట్రాటజీ..
X

తిరుపతి ఉప ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించి హడావిడి చేసిన వేళ, బీజేపీ-జనసేన అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతున్న వేళ, అధికార వైసీపీ మాత్రం ఇంకా అధికారికంగా తన అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ప్రచార పర్వంలో మాత్రం వైసీపీ సైలెంట్ స్ట్రాటజీ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి కీలక నేతలందరితో మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని తాజాగా గురుమూర్తి కలిశారు, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఫిజియో థెరపిస్ట్ గా వైద్యరంగంలో పేరుతెచ్చుకున్న గురుమూర్తి, ప్రజా క్షేత్రంలో కూడా అలాంటి మంచి పేరు తెచ్చుకోవాలని రాజమోహన్ రెడ్డి ఆకాంక్షించారట. ఈ భేటీలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. తిరుపతి పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసి త్వరలో వారి సమక్షంలో గురుమూర్తిని అధికారిక అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజమోహన్ రెడ్డిని గురుమూర్తి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు మరణంతో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తున్నాయి. అయితే సింపతీ ఓట్లపై నమ్మకం పెట్టుకోకుండా దుర్గా ప్రసాదరావు కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వకుండా.. వైసీపీ కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతోంది. రాజకీయ నేపథ్యం ఏమాత్రం లేని ఫిజియో థెరపిస్ట్ వైద్యుడు గురుమూర్తి పేరు తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ తమ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరుని ప్రకటించి, ప్రచార కార్యక్రమాలు కూడా మొదలు పెట్టింది. దుర్గాప్రసాదరావు కుటుంబానికి టికెట్ నిరాకరించారని, ఆయన్ని అవమానించారని, టీడీపీలో ఉన్నన్ని రోజులు ఆయనకు తగినంత గౌరవం ఇచ్చామని, వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఆయన కుటుంబాన్ని పట్టించుకునేవారే లేరనేది టీడీపీ ఆరోపణ. సింపతీ ఓట్లపై కర్చీఫ్ వేయడానికి టీడీపీ వేసుకున్న ప్రణాళిక అది.

అటు తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే కాపు ఓట్లపై కన్నేసిన బీజేపీ-జనసేన కూడా దూకుడు మీదున్నాయి. సీటు మాకంటే మాకంటూ పోట్లాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పేరు కూడా తెరపైకి వచ్చింది. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆమె బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ, జనసేన రెండు పార్టీలు ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఇటు స్థానిక ఎన్నికలు కూడా జోరందుకుంటున్న వేళ.. తిరుపతి ఉప ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీంతో వైసీపీ సైలెంట్ గా తన ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది. అభ్యర్థి గురుమూర్తి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అధిష్టానం ఆదేశాలతో ఆయనకు స్థానిక నేతలు మద్దతిస్తూ రాజకీయ ఓనమాలు నేర్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక పెరిగిపోతోందంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం నిజమో కాదో, ఈ ఎన్నికల ఫలితాలతో తేలిపోయే అవకాశం ఉంది. అటు ప్రతిపక్షానికి ప్రత్యామ్నాయం మేమేనంటూ సవాల్ విసురుతున్న జనసేన-బీజేపీ బలమేంటో కూడా తిరుపతి బైపోల్ బయటపెట్టబోతోంది.

First Published:  4 Feb 2021 10:27 PM GMT
Next Story