Telugu Global
International

రైతు ఉద్యమంపై ట్విట్టర్‌లో వార్

ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం మన దేశంలోనే కాదు.. ప్రపంచమంతటా హాట్ టాపిక్‌గా మారింది. పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్‌తో.. ఈ ఇష్యూ ఇంటర్నేషనల్ ఇష్యూగా మారింది. క్రికెటర్ల నుంచి బాలీవుడ్ స్టార్‌ల వరకూ అందరి చర్చ దీని గురించే. ట్విట్టర్‌లో అసలేం జరుగుతుందంటే.. కంగనా కౌంటర్స్.. రైతు ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ వరుస పెట్టి కౌంటర్లు ఇస్తుంది కంగనా.. రిహానా ట్వీట్‌కు కంగనా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒక్కొక్కరిగా […]

రైతు ఉద్యమంపై ట్విట్టర్‌లో వార్
X

ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం మన దేశంలోనే కాదు.. ప్రపంచమంతటా హాట్ టాపిక్‌గా మారింది. పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్‌తో.. ఈ ఇష్యూ ఇంటర్నేషనల్ ఇష్యూగా మారింది. క్రికెటర్ల నుంచి బాలీవుడ్ స్టార్‌ల వరకూ అందరి చర్చ దీని గురించే. ట్విట్టర్‌లో అసలేం జరుగుతుందంటే..

కంగనా కౌంటర్స్..
రైతు ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ వరుస పెట్టి కౌంటర్లు ఇస్తుంది కంగనా.. రిహానా ట్వీట్‌కు కంగనా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఆమెకు కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టారు. ట్విట్టర్ వేదికగా అందరూ చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే రిహానాకు కంగనా ఇచ్చిన కౌంటర్‌కు తాప్సీ స్పందించింది. “ఒక ట్వీట్‌ మీ ఐక్యతను దెబ్బతీస్తే.. ఒక జోక్‌ మీ విశ్వాసాన్ని సడలింపజేస్తే.. ఒక ప్రదర్శన మత విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని భావిస్తే ముందుగా మీరు మీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. అంతేతప్ప.. ప్రాపంగాండపై ఇతరులకు లెక్చర్ ఇచ్చే టీచర్‌గా మారొద్దు” అంటూ తాప్సీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు కౌంటర్ క్వీన్ ఊరుకుంటుందా.. “బీ గ్రేడ్‌ మనుషులకు బీ గ్రేడ్‌ ఆలోచనలే వస్తాయి. ఒకరి విశ్వాసం అనేది మాతృభూమి, కుటుంబం కోసం నిలబడటంపై ఉంటుంది. ఇది కర్మ లేదా ధర్మ ఫలంగా వస్తుంది తప్ప ఉచిత సలహాలను వినొద్దు. వాటి వల్ల దేశానికి ఏమాత్రం ఉపయోగం ఉండదు. అందుకే నేను వారిని బి గ్రేడ్ అని పిలుస్తాను” అంటూ

తాప్సీని ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేసింది.
రీసెంట్‌గా రోహిత్‌ శర్మ కూడా రైతు ఉద్యమంపై స్పందించారు. అయితే అతనిని కూడా వదల్లేదు కంగనా.. రోహిత్ శర్మ తన ట్వీట్‌లో “మనమంతా కలిసికట్టుగా ఉన్నప్పుడే భారత్ బలంగా ఉంటుంది. రైతుల సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన తరుణం ఇది. దేశ ప్రగతిలో రైతులు కీలక భూమిక పోషిస్తున్నారు. అందరం కలిసి ఈ సమస్యకో పరిష్కారం కనుగొనడంలో అందరు తమ తమ పాత్రలను పోషిస్తారని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు కంగనా.. “ఈ క్రికెటర్లందరూ దోబీ దగ్గర కుక్కల్లా ఎందుకు మొరుగుతున్నారు. అటు ఇంటికి కాకుండా.. ఇటు ఘాట్‌కు కాకుండా. రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చిన విప్లవాత్మక చట్టాలకు రైతులే ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు?” అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ ట్వీట్‌ను గమనించిన ట్విట్టర్‌ యాజమాన్యం వెంటనే ట్వీట్‌ను తొలగించింది. ఇదే కాకుండా.. కంగనా రీసెంట్ గా చేసిన “ఉద్యమం చేస్తుంది రైతులు కాదు ఉగ్రవాదులు”, “రైతు ఉద్యమం దేశానికి పట్టిన క్యాన్సర్” అన్న ట్వీట్స్‌ను కూడా ట్విట్టర్ తొలగించింది.

ఇదే టాపిక్..
ఇకపోతే.. అంతర్జాతీయ సెలబ్రిటీలు ట్వీట్లు చేయడంపై బీజేపీకి చెందిన కొందరు సెలబ్రిటీలు మండిపడ్డారు. ఇండియా గురించి తెలియని వాళ్లు మాట్లాడడమేంటని ఎంపీ హేమమాలిని, వాస్తవాలు తెలుసుకుని స్పందించాలని ఖుష్బూ సుందర్‌ అన్నారు. గ్రెటా వట్టి పిల్లకాకి అని ఎంపీ మీనాక్షి లేఖి అన్నారు. అలాగే రైతు ఆందోళన గురించి టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా ట్వీట్ చేశాడు. “విభేదాలు తలెత్తినప్పుడే మనమంతా ఐకమత్యంగా ఉండాలి. రైతులు మన దేశంలో అంతర్భాగం. రైతుల సమస్యలకు సంబంధించి ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారం కొరకు అన్ని పార్టీలు, వర్గాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంతో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తారని భావిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రైతు సమస్యలపై నీకేం తెలుసు అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరో పక్క భారత్ లోని కొత్త రైతు చట్టాలతో భారత్‌ మార్కెట్‌ బలపడుతుందని అమెరికా అభిప్రాయపడింది. అయితే ఈ ఆందోళనల్ని చర్చల ద్వారా పరిష్కరించాలని, శాంతియుతంగా నిరసనలు జరపడం ప్రజాస్వామ్య దేశాల లక్షణమని అమెరికా పేర్కొంది. ఇలా మొత్తానికి ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమం.. ప్రపంచమంతటా హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.

First Published:  5 Feb 2021 3:09 AM GMT
Next Story