Telugu Global
Cinema & Entertainment

మరో భామను పరిచయం చేస్తున్న కల్యాణ్ రామ్

ముద్దుగుమ్మల్ని వెండితెరకు పరిచయం చేయడం కల్యాణ్ రామ్ కు కొత్త కాదు. ఇంతకుముందు ఎంతోమంది హీరోయిన్లను పరిచయం చేశాడు. అయితే ఈసారి ఆయన హీరోయిన్ బదులు, ఓ  ఐటెంభామను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు. ప్రస్తుతం మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు కల్యాణ్ రామ్. ఈ సినిమాలో ఓ ఐటెంసాంగ్ ఉంది. ఈ సాంగ్ కోసం వెరీనా హుస్సేన్ అనే బాలీవుడ్ భామను సెలక్ట్ చేశాడు. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా. నిజానికి వెరీనా […]

మరో భామను పరిచయం చేస్తున్న కల్యాణ్ రామ్
X

ముద్దుగుమ్మల్ని వెండితెరకు పరిచయం చేయడం కల్యాణ్ రామ్ కు కొత్త కాదు. ఇంతకుముందు ఎంతోమంది హీరోయిన్లను పరిచయం చేశాడు. అయితే ఈసారి ఆయన హీరోయిన్ బదులు, ఓ ఐటెంభామను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు.

ప్రస్తుతం మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు కల్యాణ్ రామ్. ఈ సినిమాలో ఓ ఐటెంసాంగ్ ఉంది. ఈ సాంగ్ కోసం వెరీనా హుస్సేన్ అనే బాలీవుడ్ భామను సెలక్ట్ చేశాడు.
తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా.

నిజానికి వెరీనా హుస్సేన్ ను ఐటెంసాంగ్ కోసం తీసుకున్నప్పటికీ ఆమెలో హీరోయిన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ముందుగా ఎంట్రీ ఇవ్వడం ముఖ్యం కాబట్టి, ఐటెంసాంగ్ ఆఫర్ అయినప్పటికీ ఒప్పుకుంది హుస్సేన్. ఈ సినిమా రిలీజైన తర్వాత ఆమెకు తెలుగు నుంచి హీరోయిన్ ఆఫర్లు వస్తాయేమో చూడాలి. అన్నట్టు బాలీవుడ్ లో ఆమె చాలా పాపులర్.

ఇక నందమూరి కల్యాణ్ రామ్ సినిమా విషయానికొస్తే.. మల్లిడి వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతం రామకృష్ణ స్టుడియోస్ లో షూటింగ్ జరుగుతోంది. ఇందులో కల్యాణ్ రామ్ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు.

First Published:  4 Feb 2021 12:04 AM GMT
Next Story